ఏపీ: ఎఫ్డిసి చైర్మన్గా పి భరత్ భూషణ్..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డిసి) చైర్మన్గా భరత్ భూషణ్ ఎంపికయ్యారు. గత 20 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఘనత అందుకున్నారు. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీని స్థాపించి ఎంతో మందికి అవకాశాలను కల్పించారు. అదేవిధంగా సినిమాల పైన ఉండే ఇంట్రెస్ట్ తో సినీ పరిశ్రమకు ఆయన వంతు అండగా నిలబడడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు.అలాంటి సమయంలోనే సినీ కార్మికుల సమస్యలను డిస్ట్రిబ్యూషన్ల ఇబ్బందులను సైతం తీర్చడంలో ఆయన హస్తం ఉంది.


దీంతో ఆయన సేవలను గుర్తించి  ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎఫ్డిసి చైర్మన్ బాధ్యతలను కూడా అప్పగించారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి సైతం ప్రత్యేకించి దృష్టి సాధించిన ఏపీ ప్రభుత్వం భరత్ భూషణ్ గారిని చైర్మన్గా ఎంపిక చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో సినిమాకు సంబంధించి  అభివృద్ధి వంటి బాధ్యతలను ఆయనకు అప్పగించారు.


ఈ బాధ్యతలను అప్పగించడం పై సినీ ఇండస్ట్రీ వర్గాలు కూడా అభినందనలు తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వానికి. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా భరత్ భూషణ్ నియమితులైన వెంటనే సినీ నటుడు నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయం పైన నందమూరి బాలకృష్ణ కూడా భరత్ భూషణ్ కు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా సినీ టీవీ ,నాటక రంగాల అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఇప్పటికే సినీ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి పైన ప్రత్యేకించి మరి దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: