ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2 వచ్చేది ఎప్పుడంటే..?
ముఖ్యంగా హీరోయిన్ దీపిక తప్పుకోవడంతో చిత్ర బృందం మరో హీరోయిన్ ని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు అమితాబచ్చన్ వయసు పైబడడంతో షూటింగ్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారట. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చాయని సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, 60 శాతం వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు వినిపిస్తున్నా. దీపిక స్థానంలో హీరోయిన్ సాయి పల్లవి నటించిన అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఎక్కువ భాగం ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి నటులకు సంబంధించి కీలకమైన సన్నివేశాలు పెద్ద ఎత్తున చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం పైనే మరింత బడ్జెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని 2027 డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే కేటాయించేలా చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా యాస్కిన్ (కమలహాసన్), ప్రభాస్ (భైరవ) మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండబోతున్నాయట. అలాగే అమితాబ్చ్చన్ పాత్ర కి సంబంధించి కొన్ని హైలైట్ గా నిలుస్తాయని వినిపిస్తోంది. మరి దీపిక స్థానంలో ఏ హీరోయిన్ ని తీసుకువస్తారో చూడాలి మరి. అలాగే ప్రభాస్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.