టీవీ: యాంకర్ శ్యామల నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఈమె గత కొన్ని సంవత్సరాలుగా అటు సీరియల్స్లోను ఇటు పలు సినిమా ఈవెంట్లకు, ఆడియో ఫంక్షన్లకు, బుల్లితెరపై షోలకు యాంకరింగ్ చేస్తూ ఉంటుంది.. ఒకపక్క యాంకరింగ్ లో బిజీగా ఉంటూనే.."ఏం చెప్పారు శ్యామల గారు" అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది.. ఇక ఈమె నెలలో 30 రోజులు కూడా ఈమె యాంకరింగ్ లో బిజీగా ఉంటోంది అని సమాచారం.. శ్యామల కొన్ని సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె చిన్నప్పటినుంచి నటన మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో తన చదువు పూర్తయ్యాక హైదరాబాద్ రావడం జరిగింది..
హైదరాబాదులో కొద్దిరోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత 2010 వ సంవత్సరములో లయ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.. తన నటనతో మెప్పించిన శ్యామల సినిమాలలో, సీరియల్స్లో కూడా అవకాశం కొట్టేసింది..ఇక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే విషయానికి వస్తే ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రూ. 80 వేల నుంచి రూ.1 లక్ష రూపాయల వరకు తీసుకుంటోందట..
అయితే ఒక్కో సినిమాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అలాగే యాంకరింగ్ అయితే ఒక్కో ఎపిసోడ్ కు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు తీసుకుంటుందట.. ఇక సినిమా ఇంటర్వ్యూలు ఇలా అన్ని కలిపి దాదాపుగా నెలకు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు శ్యామల తీసుకుంటోందని సమాచారం.