మా టీవిలో ప్రసారం అవుతున్న ఫైలు సీరియల్ దేవత లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటుగా టెన్షన్ కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే ఒక అందమైన సీరియల్ ని ఎక్కడ ట్విస్ట్ లంటూ చెత్త చేస్తారేమో నని. అసలు విషయం ఏమిటంటే పదహారణాల అచ్చు పల్లెటూరి పైరులా ఎంతో స్వచ్చంగా ఉండే రుక్మిణి పాత్ర అంటే అందరికీ ఎంతో ఇష్టం. అలాంటిది ఆదిత్యకు రుక్మిణి ని దూరం చేయడం చాలా మంది ప్రేక్షకులు భరించలేకపోతున్నారు. ఇక ఇపుడైనా తమ కూతురు దేవి వల్ల ఇద్దరు ఒకటవుతారు అనుకుంటున్న సమయంలో మళ్ళీ మాధవ్ రుక్మిణి ని ప్రేమించడం లాంటి ట్విస్ట్ లు వారికి అస్సలు నచ్చడం లేదు. సీరియల్ ని ఎందుకు ఇలా చెత్త ట్విస్ట్ లతో పాడు చేస్తున్నారు.
త్వరగా ఆదిత్యను, రుక్మిణి పాత్రను ఒకటి చేసి కావాలంటే అక్కడ కొత్త ట్విస్ట్ లు పెట్టాలి కానీ ఎవరి భార్యను, బిడ్డను మరెవరో తమ భార్య బిడ్డగా చెప్పుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికపై మండి పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ కామెంట్స్ మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో సీరియల్ ట్రాక్ ని కాస్త ముందుకు జరిపి త్వరలోనే రుక్మిణి, ఆదిత్యలను ఒకటి చేసే కంటెంట్ ను రెడీ చేసుకున్నారట డైరెక్టర్. దేవత సీరియల్ స్టార్ మా టీవిలో అత్యధిక రేటింగ్ పొందుతున్న ధారావాహికలలో ఒకటి. మరి అలాంటి సీరియల్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించకూడదని దర్శకుడు కథ యాంగిల్ ను కాస్త ముందుకు జరిపారట.
ఇక ఈ వారంలోనే అసలు మాధవ్ కి రాధకి పెళ్లి కాలేదన్న విషయం, రుక్మిణినే రాధగా బ్రతుకుతుంది అన్న విషయం ముందుగా రమ్యకు తెలిసిపోతుంది. రుక్మిణి ఈ విషయాన్ని చెప్పొద్దని ప్రాధేయ పడుతుందట. అయినా ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్పేస్తుందట రమ్య. ఇక ఇప్పుడే కథలో మరో ట్విస్ట్ మొదలు కానుందట, మరి దేవి ఎవరి పాప అన్న కొత్త ప్రశ్న ఇలా సీరియల్ ను కొత్త మలుపు తిప్పనున్నారని సమాచారం. మరి మునుముందు అసలు ఏం జరగనుందో చూద్దాం.