ఆ కంటెస్టెంట్ నామినేషన్స్ కోసమే వచ్చాడా..??

N.ANJI
బుల్లితెరపై బిగ్ బాస్ 50రోజులు పూర్తి చేసుకుంది. హౌస్ లో నుండి బయటికి పంపించడానికి ప్రతివారం కంటెస్టెంట్ నామినేట్ అవుతూనే ఉంటారు. అయ్యితే ఓ కంటెస్టెంట్ మాత్రం ప్రతివారం నామినేట్ అవుతూనే వస్తున్నాడు. అతను మరెవరో కాదు.. యాంకర్ రవి. ఆయన ఒక్క వారం కూడా మిస్ కాకుండా 8 వారాలు నామినేట్ అయ్యారు. ఒక్క విధంగా చెప్పాలంటే నామినేషన్స్ కేవలం ఆయన కోసమే పెట్టారేమో అనేంతగా ప్రతీవారం నామినేట్ అవుతూనే ఉన్నాడు.
ఇక బిగ్ బాస్ లో ప్రతీ సోమవారం రావడం.. ఈయన నామినేషన్స్‌లోకి వెళ్ళడం కామన్ సీన్ గా మారిపోయింది. అయితే కొన్నిసార్లు సీరియస్ కారణాలతోనే ఈయన్ని నామినేట్ చేసిన ఇంటి సభ్యులు మరికొన్నిసార్లు మాత్రం కుర్చీల మీద టవల్ ఆరేస్తున్నాడనే నామినేట్ అయ్యారు. రవి ప్రతివారం సేవ్ అవుతున్నాడు కదా అని అందరికీ సాఫ్ట్ టార్గెట్ మారిపోయాడు .  
ఆ ఇంట్లో కొందరికి నామినేట్ చేయాలంటే ముందుగానే గుర్తుకొచ్చే పేరు రవి అనే చెప్పాలి. ఇండస్ట్రీలో మంచి పేరు.. క్రేజ్ ఉంది.. ఒకవేళ నామినేట్ చేసినా కూడా ఈజీగా సేవ్ అయిపోతాడనే ధైర్యం కంటెస్టెంట్స్‌లో కనిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. కొన్నిసార్లు బిగ్ బాస్ కూడా యాంకర్ రవితో ఆడుకుంటున్న సంగతి అందరికి తెల్సిందే. ఇలా ఉండగా  బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ ముందులా కాకుండా చాలా ఎమోషనల్‌గా అయ్యాయి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఒక్కరి కోసం మరొక్కరు త్యాగం చేసుకున్నారు.
ఈ వారం అందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. అయితే అందులో ఎవరు లేఖ అందుకుంటే వాళ్లు సేఫ్.. అందుకోని వాళ్లు నామినేట్ అవుతారని చెప్పుకొచ్చారు బిగ్ బాస్. ఇక శ్రీరామచంద్ర, యాంకర్ రవికి కలిపి ఒకేసారి రెండు లేఖలు రావడంతో అందులో శ్రీరామ్‌కు లెటర్ ఇచ్చేసి రవి నామినేట్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా రవి  వరసగా 8వ సారి నామినేట్ అయి రికార్డులు తిరగరాస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: