టీవీ :నా పేరు మీనాక్షి సీరియల్ దీపిక అగర్వాల్ రియల్ లైఫ్..!!

Divya
బుల్లితెరపై సీరియల్స్ అంటే కేవలం స్టార్ మా, జీ 5 ఛానెల్స్ సీరియల్స్ మాత్రమే ప్రేక్షకులను అలరించడం కాదు.. ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఎన్నో సీరియల్స్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే ఈ సీరియల్స్ రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా వినోదం తో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాయి. మంచి కథా కథాంశంతో నటీనటులతో ప్రేక్షకులను అలరిస్తున్న ధారావాహికలలో నా పేరు మీనాక్షి సీరియల్ కూడా ఒకటి.. ఇందులో ప్రముఖ కన్నడ నటి నవ్య స్వామి ప్రధాన పాత్ర పోషిస్తుండగా , ఈమె కు పోటీగా నెగిటివ్ పాత్రలో దీపిక అగర్వాల్ అందరిని బాగా అలరిస్తోంది.. ఈమె వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతున్నట్టు నటిస్తూ.. ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.. దీపిక అగర్వాల్ రియల్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

దీపిక అగర్వాల్ అసలు పేరు వీణ పొన్నప్ప.. 1990వ సంవత్సరం జనవరి 6వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కొడగు అనే ప్రాంతంలో జన్మించింది. ఇక వీరి ఫ్యామిలీ అంతా బెంగళూరు లోని మైసూర్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక విద్యాభ్యాసం విషయానికొస్తే, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసింది. అందరిలాగే ఈమె కూడా నటన మీద ఆసక్తితో మొదట సీఐడీ కర్ణాటక అనే సీరియల్లో పోలీస్ ఆఫీసర్ చార్వి పాత్రలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. హర హర మహాదేవ ,కిన్నెర వంటి సీరియల్స్లో కూడా నటించి అందరిని బాగా అలరించింది.
కన్నడ సినిమాల విషయానికి వస్తే, జాత్రి, దండుపాళ్యం 4, సీతారామ కళ్యాణం వంటి సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించింది. అంతేకాదు ఈమె తమిళ్ లో కూడా ప్రస్తుతం శివ మనసుల శక్తి వంటి సీరియల్ లో నెగటివ్ పాత్రలు పోషిస్తోంది. ఈ సీరియల్ తెలుగులో అగ్నిసాక్షి గా ప్రసారం అవుతోంది. మరోవైపు తెలుగులో ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి అనే సీరియల్లో కూడా దీపిక అగర్వాల్ అనే పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: