బిగ్ బాస్ 5: హాట్ డ్రెస్ లో శ్వేత... కెప్టెన్ గా గెలుస్తుందా ?

VAMSI
నేడు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఈ టాస్క్ టైటిల్ పేరు "స్విమ్ జర స్విమ్ జర". బిగ్ బాస్ కెప్టెన్సీ ఎవరన్నది డిసైడ్ చేయడానికి ఈ టాస్క్ పెట్టారు. ఈరోజు ఎపిసోడ్ లో ఈ టాస్క్ జరగనుంది. మరి కెప్టెన్సీ పోటీ దారులు ఎవరికి వారు ప్రయత్నిస్తూ ఆడుతారో లేక ఒకరికొకరు పోట్లాడుకుని టాస్క్ ను నానారభస సృష్టిస్తారో చూడాలి. ఈ టాస్క్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులు రవి, శ్వేత వర్మ, జస్వంత్ మరియు శ్రీ రామ్ చంద్రలు స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుతూ కనిపించారు. మిగిలిన ఇంటి సభ్యులంతా బయట నిల్చొని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు టాస్క్ ఏమిటంటే పూల్ లో కెప్టెన్ వర్డ్ లెటర్స్ ఉన్నాయి. పోటీదారులు ఒక్కో కెప్టెన్ వర్డ్ లోని లెటర్స్ క్యాపిటల్ టీ, స్మాల్ ఎల్ అలాగా ఒక్కో స్టైల్ లో ఇచ్చారు.
దాని ప్రకారం వారు ఆ లెటర్స్ ను పూల్ లో వెతికి తీసుకొచ్చి బయట వారి బెంచ్ వద్ద కరెక్ట్ గా పేర్చాలి. ముందు ఎవరిది కంప్లీట్ అయితే వారే ఈ వారం కెప్టెన్ గా హౌస్ లో అధికారాన్ని పొందుతారు. ఇక టాస్క్ విషయానికొస్తే పోటీదారులు మేల్ కంటెస్టెంట్ లు టీ షర్ట్, బనియన్లు, షార్ట్ లు వేసుకోగా.. శ్వేత మాత్రం స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈమె మాటలు చాలా బోల్డ్ గా ఉంటాయన్నది ఇప్పటి వరకు హౌస్ లో చూశాము. అలాంటిది హాట్ డ్రెస్ వేసుకుని మరింత షాక్ ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. టాస్క్ చాలా రసవత్తరంగా సాగుతూ కనువిందు చేయనుందని అర్థమవుతోంది.
ఇక కెప్టెన్సీ టాస్క్ విషయానికొస్తే రవి చేయలేక మధ్యలోనే అలసిపోయి ఆగిపోయినట్లు కనిపించాడు. జస్వంత్ కూడా అంత ఫాస్ట్ మూవ్ ఇచ్చినట్లు అనిపించలేదు. శ్వేత వర్మ ఎలాగైనా గెలవాలన్న కసితో ఏదీ లెక్క చేయకుండా పరుగులు తీయడం కనిపించింది. శ్రీ రామ్ చంద్ర అందరి కన్నా ఫాస్ట్ గా లెటర్స్ ను సమకూరుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మూడవ హౌస్ కెప్టెన్ గా శ్రీ రామ్ చంద్ర విజయం సాధించినట్లు సమాచారం. మరి కెప్టెన్సీ  టాస్క్ విశేషాల్ని పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం ఈరోజు రాత్రి పదిగంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: