బిగ్ బాస్ 5: ముందు సీజన్ ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?

VAMSI
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలయింది. రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ అభిమానులకు ఒకేసారి ఫుల్ మీల్స్ పెట్టడానికి నిర్వాహక బృందం ఎన్నో కసరత్తులు చేసి గత ఆదివారమే షో ను స్టార్ట్ చేశారు. షో స్టార్ట్ అయి కనీసం వారం కూడా కాలేదు అప్పుడే బిగ్ బాస్ టైటిల్ విజేతను డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక షో ముగిసే వరకు టైటిల్ విజేతల పేర్లు మారుతూనే ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో వారిపై కథనాలు ఏదో రాస్తుంటారు. కానీ వాళ్ళే ఎందుకు గెలుస్తారు అన్నదానికి ఒక్కరి దగ్గర కూడా సాలిడ్ రీజన్ ఉండదు.
ప్రస్తుతం జరిగిన నాలుగు రోజులలో తీక్షణంగా గమనిస్తే ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా నేదుకు హౌస్ లోకి వచ్చారో అర్ధం కానట్లు బిహేవ్ చేస్తున్నారు. కానీ స్టేజి మీద నాగార్జున ముందు మాత్రం ఏవేవో కబుర్లు అయితే చెప్పారు. కానీ ఇక్కడ హౌస్ లో ఆ విధంగా ఉండడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే, అభిమానులు తమ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ లను ఎన్నుకుని వారి గురించి సోషల్ మీడియా వేదికలుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఉంటారు. అయితే మీరు కనుక బిగ్ బాస్ సీజన్ లను ఒకసారి గమనిస్తే, సీజన్ 1 లో  శివబాలాజీ విన్నర్ అయ్యే వరకు ఎవ్వరూ ఊహించలేదు.
హౌస్ లో కూడా శివబాలాజీ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అంతే, కానీ గెలిచాడు. రెండవ సీజన్ లో కూడా కౌశల్ మందా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులందరికి శత్రువులా మారిపోయాడు. కానీ చివరికి గెలిచాడు. ఇక మూడవ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ ఏదో పునర్నవి తో రొమాన్స్ ట్రాక్ వల్ల హైలైట్ అయ్యాడు. లేదంటే అతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, అయినా గెలిచాడు. ఒక్క నాలుగవ సీజన్ లో మాత్రమే మొదటి నుండి గెలిచేది అభిజిత్ అని అంతా అనుకుంటూనే ఉన్నారు. అలాగే జరిగింది. ఇలా చూస్తే ఈ సీజన్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉండేవారు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ సెంటిమెంట్ నిజమవుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: