టీవీ : బిగ్ బాస్ షో ని వదలని ప్రేమజంటలు..

Divya
బిగ్ బాస్ రియాల్టీ షో.. గత నాలుగు సీజన్ల నుంచి సెలబ్రిటీలు పాల్గొని,  ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు.ఇక  త్వరలోనే సీజన్ ఫైవ్ కూడా మొదలు కాబోతుంది. అయితే ఈ సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్ లుగా వెళ్ళి, ఏం చేస్తారో అనే విషయంపై, ప్రతిరోజూ ఎప్పటికప్పుడు, ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఎవరెవరిని సెలెక్ట్  చేశారు అనే విషయం మాత్రం తెలియలేదు. ఇకపోతే ప్రతి సీజన్లోనూ కచ్చితంగా ప్రేమ జంటలు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవడం చూస్తున్న విషయమే . ఇప్పుడు కూడా సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి మరొకసారి కొత్త జోడి ఎంటర్ అవుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ జోడీలు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇకపోతే సీజన్ ఫైవ్ జూలై నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో దీనిని సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక సాధారణంగా బిగ్ బాస్ సీజన్ త్రీ లో పెళ్లి అయిన వితిక వరుణ్ సందేశ్ దంపతులు వెళ్లి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇకపోతే త్వరలో ఈ బిగ్ బాస్ హౌస్ లోకి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న శ్రీహాన్ - సిరి హనుమంత్ జంటను  పంపించడానికి నిర్మాతలు చూస్తూన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికీ సిరి హనుమంత్ పలు ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసి, ఉయ్యాల జంపాలసీరియల్ ద్వారా బుల్లితెరపై  అడుగులు వేశారు.
ఇకపోతే సిరి గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ హాన్ తో   ప్రేమ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రేమలో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఫైవ్ లోకి ఎంటర్ కావడానికి అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇక ఇటీవల ప్రసారమైన స్టార్ మ్యూజిక్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ఈ జోడిని పెళ్లి కాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: