ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో తెలుసా..?

Divya
సరిగ్గా చూడండి.. గుర్తుపట్టారా..? మీరు అనుకుంటున్నది నిజమే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పాప, ఇప్పుడు ఒక బుల్లి తెర స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు నవ్య స్వామి. కర్ణాటకకు చెందిన ఈ భామ, ప్రస్తుతం గత కొద్ది నెలల నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో నిలుస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న " నా పేరు మీనాక్షి" సీరియల్ ద్వారా బాగా ఫేమ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, మరొక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న " ఆమె కథ" సీరియల్ లో నటుడు రవి కృష్ణ తో కలిసి నటిస్తోంది.

అంతేకాదు ఇక వీరిద్దరూ బయట చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, అభిమానులకి అలాగే కెమెరా కంట పడడంతో , వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు కూడా చాలానే వస్తున్నాయి. కాకపోతే వీరిద్దరి మధ్య ఏదీ లేదని ఇద్దరూ కొట్టిపారేసినా, వీరు ఎప్పటికప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలకు అటెండ్ అవ్వడం, అలాగే బయట తిరగడం, ఫోటో షూట్ జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చూస్తే మాత్రం, వీరిద్దరి మధ్య ఏదో ఉందని అంటున్నారు ప్రేక్షకులు.. కాకపోతే ఇటీవల ఈ విషయంపై స్పందించిన నవ్య స్వామి.. మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం నవ్య స్వామి తన ఫేమ్ మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే, ఈటీవీలో ప్రసారమవుతున్న " శ్రీదేవి డ్రామా కంపెనీ " కామెడీ షో లో పాల్గొంటూ తెగ సందడి చేస్తోంది. ఇక అంతే కాదు ఈమె సినీ ఇండస్ట్రీ లోకి వెళ్లాలని ప్రస్తుతం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు సినిమా ఆఫర్లు వస్తే , సీరియల్ లో డేట్స్ కుదరక సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ఇక  చూడడానికి హీరోయిన్ రేంజ్ లో ఉండే నవ్య స్వామి, త్వరలోనే సినిమాల వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఇమేజ్  తో స్టార్ హీరోయిన్ గా  ఎదగాలనే తపనతోనే, ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు ఇండస్ట్రీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె  చిన్ననాటి ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: