టీవీ: బుల్లితెరపై ఈ నటిని బ్యాన్ చేశారు.. కారణం ఏంటో తెలుసా ?

Divya

బుల్లితెరపై ఎంతో మంది హీరోయిన్లు మంచి పేరు సంపాదించుకొని, కొన్ని కారణాల చేత కనుమరుగవుతూ వుంటారు. అలాంటి వారిలో" పల్లవి గౌడ్ "కూడా ఒకరు. ఈమె కన్నడ భామ అయినప్పటికీ, తెలుగులో ప్రేక్షకుల ఆదరణ బాగానే సంపాదించింది. అయితే ఈ భామను బుల్లితెరపై బ్యాన్ చేశారట. ఎందుకో తెలుసుకుందాం.
జీ తెలుగు లో ప్రసారమయ్యే"పసుపు కుంకుమ" సీరియల్లో "అంజలి"గా నటించి, తెలుగు బుల్లితెరపై కనిపించింది. ఈ కన్నడ భామ" పల్లవి గౌడ్". ఆ తర్వాత"సావిత్రి " సీరియల్ లో నటించి, కొన్ని కారణాల చేత ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. అలా ఎందుకు తప్పుకుంది అనే విషయం ఆమె బయటకి చెప్పలేదు. ఆమెకి ఎక్కువగా యానిమేషన్ మీద పట్టు ఉండడంతో అటు వెళ్దాం అనుకుంది. కానీ అనుకోని కారణాలవల్ల టివి రంగంలోకి అడుగు పెట్టవలసి వచ్చిందని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె తన పై బ్యాన్ చేసిన విషయాన్ని తెలిపింది. అది ఎందుకంటే "సావిత్రి" నాటిక చేసేటప్పుడు, వేరే నాటికలు నటించబోనని అగ్రిమెంట్ చేసుకున్నానని తెలిపింది. అలా సీరియల్ లో నటిస్తున్నప్పుడు, తనకు పేమెంట్ సరిగ్గా ఇచ్చేవారు కాదని తెలిపింది. దాదాపుగా రెండు నెలలు సైతం లేటుగా ఇచ్చేవారని తెలిపింది. దాంతో నాకు వేరే నాటిక లో ఆఫర్ వచ్చిందని నిర్మాతలకు చెబితే, నిర్మాతలు ఈ విషయంపై ఒప్పుకోలేదని తెలిపింది.
సరేలే అని.. నిర్మాతలని తన పెండింగ్ మనీ అయిన ఇవ్వమని అడగగా.. అది కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. అలా డబ్బులు ఇవ్వకపోవడంతో నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దాంతో నేను వేరే సీరియల్స్ లో  నటిస్తానని చెప్పడంతో.. ప్రొడ్యూసర్ కౌన్సిల్  తనపై బ్యాన్ చేశారని తెలిపింది. ఇక అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపింది. కొన్ని మనస్పర్థల కారణంగా తన భర్తతో కూడా విడిపోయానని తెలిపింది. అంతేకాకుండా విడాకులు కూడా తీసుకున్నామని తెలిపింది.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి  ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: