బిగ్ బాస్ హౌసులో అభిజిత్ కుప్పకూలాడు....కారణం ఇదే
హోటల్ సర్వీస్ లో క్వాలిటీ లేదన్న కారణంగా ఇంట్లో రిచ్ పీపుల్ మరియు హోటల్ స్టాప్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. హోటల్ భోజనంలో సర్వీస్ చేసే సమయంలో అందులో పిన్ను పెట్టి ఇచ్చాడు అవినాష్.... అది తెలియని రిచ్ పీపుల్ ఏంటీ భోజనం అంటూ హోటల్ స్టాప్ పై విరుచుకుపడ్డారు... అలా అలా గొడవ పెరుగుతూ మెహబూబ్ రెచ్చిపోవడంతో అవినాష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఇంటి వాతావరణం వేడెక్కింది.
ఆ తర్వాత రిచ్ పీపుల్ హోటల్ స్టాఫ్ కు చిన్న చిన్న టాస్క్ లు ఇస్తూ వాటిని కంప్లీట్ చేస్తే వారి దగ్గర ఉన్న నగదు ఇస్తామని... రూల్ పెడతారు.... ఈ తరహాలో అమ్మ రాజ శేఖర్ మాస్టర్ కు స్విమ్మింగ్ పూల్ లో ఫిఫ్టీ టైమ్స్ దూకాలని మరియు అభిజిత్ ని వెయిట్ లిఫ్టింగ్ తో హండ్రెడ్ టైమ్స్ చేయాలని చెబుతారు..... మాస్టర్ రిచ్ పీపుల్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయగా... అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో ఎక్కువసార్లు చేయడం వలన నీరసించి ఉన్నట్టుండి పడిపోతాడు..... అప్పుడు ఇంటి సభ్యులు అందరూ వచ్చి అభిజిత్ కి సేవలు చేసి మరీ అతడికి ధైర్యం చెప్పారు... ఇలా నిన్నటి ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ హాట్ హాట్ గా కొనసాగింది....