రష్మీ సుధీర్ పెళ్లిపై యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..!
అయితే ఒకవైపు రష్మీ సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుండగా.. ఇదంతా ఉత్తదే అని వాళ్లిద్దరూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ రవి చేసిన కామెంట్స్ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఎక్స్ట్రా జబర్ధస్త్‌కు గెస్ట్‌గా వచ్చిన అతడు రష్మీతో సుధీర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ కామెంట్లు చేశాడు. దీంతో ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే రాకింగ్ రాకేష్ స్కిట్లో భాగంగా దువ్వాడ జగన్నాథమ్ గెటప్ వేసిన యాంకర్ రవి. ఇక రష్మీ గౌతమ్ దగ్గరకు వెళ్లి ‘ఏవమ్మా అరవై ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటావా.. లేకుంటే షష్టిపూర్తి సమయంలో శుభకార్యమంటే బాగోదు. ఏంటి ప్రాబ్లం వాడు ఒప్పుకోవడం లేదా. కాదు కాదు నువ్వే ఒప్పుకోవట్లేదంట కదా. ఒప్పేసుకోరాదు ఆ శుభకార్యమేదో నేనే జరిపిస్తా అంటూ కామెంట్లు చేశారు..
ఇక యాంకర్ రవి చేసిన కామెంట్లతో రష్మీ గౌతమ్ తెగ సిగ్గు పడిపోయింది. దీంతో ‘సిగ్గు పడుతున్నావంటే శుభాకార్యం చాలా దగ్గరలోనే ఉంది' అంటూ అతడు మరో డైలాగ్ విసిరాడు. ఇలా రవి, రష్మీ మధ్య జరిగిన సంభాషణ వచ్చే వారం ఎపిసోడ్లో హైలైట్ అవనుందని అర్థం అవుతోంది. ఈ కారణంగానే ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోమోకు భారీ స్థాయిలో స్పందన వస్తోందన్నారు. ఈ వీడియో చూసినా నెటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.