కరోనాను జయించిన 92 ఏళ్ల డయాబెటిక్ వృద్ధురాలు, 74 ఏళ్ల వృద్ధుడు.....

SS Marvels
గత 9 నెలలుగా కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దాని ప్రభావం ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారి మీద మరియు వృద్ధుల మీద ఉంటుంది. మరణం సంభవిస్తున్న కేసులు ఎక్కువగా అవే. ఇక గుంటూరు జిల్లాలో 92 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది.




గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఎడ్లపల్లి రామానుజమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 6న బామ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గుంటూరులోని శ్రావణి ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ పోసాని శ్రీనివాసరావు శ్రద్ధ తీసుకుని వైద్యం చేశారు. దీంతో రామానుజమ్మ  వారంరోజుల్లోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లారు. ఈ నెల 12న బామ్మ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకుంది. 92 ఏళ్ల బామ్మకు డయాబెటిస్ సమస్య కూడా ఉంది. అయినప్పటికీ ఆమె కేవలం వారం రోజుల వ్యవధిలోనే కోలుకోవడం ఆస్పత్రి వర్గాలను కూడా ఆశ్చర్యపడేలా చేసింది. ప్రస్తుతం బామ్మ రామానుజమ్మ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ పోసాని శ్రీనివాసరావు చెప్పారు. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అలాగని కరోనా వచ్చిందని బయపడాల్సిన అవసరంలేదని డాక్టర్ పోసాని చెప్పారు.



అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరులో 74 ఏళ్ల వ్యక్తి కరోనాను జయించాడు. ఆ వృద్ధుడిని గిద్దలూరు సీఐ సుధాకర్ ఘనంగా సన్మానించారు. ఏడు పదులు నిండిన వయసులోనూ ఎంతో ధైర్యంగా కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వృద్ధుడి కుమారుడు మీడియాలో పని చేస్తూ కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో తన కొడుక్కి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపడానికి పలువురు అభినందించారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ, స్వీయ నియంత్రణతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఉంటే కరోనాను అతి త్వరలో సమూలంగా నియంత్రించగలమని సీఐ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: