బుల్లి పిట్ట: ఈ మార్పులు మీ మొబైల్ లో కనిపిస్తే హ్యాక్ అయినట్లే..!!

Divya
ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ ని కచ్చితంగా వినియోగిస్తూ ఉన్నారు. అలా వినియోగిస్తున్న సమయంలో మీ స్మార్ట్ మొబైల్ లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయా అయితే కచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయినట్లే అని నిపుణులు తెలియజేస్తున్నారు. రెగ్యులర్ గా మీ మొబైల్ మీరు చూస్తూ ఉంటారు కొన్ని సమయాలలో మీ మొబైల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడవలసి ఉంటుంది. వాస్త వానికి మీ మొబైల్లో అటువంటి సమస్య ఉంది అని మీకు కూడా డౌట్ రాకపోవచ్చు. అందుకే మీ మొబైల్ లో హ్యాక్ అయినట్లుగా గుర్తించడానికి కొన్ని గుర్తులు కనిపిస్తే మనం గమనించవచ్చు.
ప్రతిరోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అందరూ బాగా వినియోగిస్తున్నారు. మొబైల్స్ ని. ముందుగా మీ మొబైల్ హ్యాక్ అయినట్లు అయితే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా తగ్గిపోతుంది. అలాగే మీరు వాడకుండానే మీ డేటా మొత్తం అయిపోతుంది.. లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాగా వేగంగా పనిచేసే మీ మొబైల్ స్పీడ్ సడన్ గా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మొబైల్ దానంతట అదే రీస్టార్ట్ అవ్వడం వాటి లక్షణాలు గుర్తుంచు కోవాలి.

అయితే ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్స్ లో చూసి సాధారణ సమస్యగా గుర్తించవచ్చు.కానీ కొత్తగా తీసుకున్న లేటెస్ట్ స్మార్ట్ మొబైల్స్ లో కూడా ఈ సమస్య ఉన్నట్లు అయితే ఈ మొబైల్ కచ్చితంగా హ్యాక్ అయినట్లే అని మీరు నిర్ధారించవచ్చని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అందుచేతనే థర్డ్ పార్టీ యాప్లను ఎక్కువగా ఉపయోగించకూడదని నీపునులు తెలియజేస్తూ ఉంటారు. అందుచేతనే మొబైల్స్ నెంబర్ కానీ ఇతర వైఫై వాటిని వాడేటప్పుడు పలు జాగ్రత్త గా వాటిని వినియోగించడం మంచిది. అందుచేతనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: