ఈ కారుకి డ్రైవర్ అవసరం లేదు.. అదే వెళ్తుంది?

చాలా మందికి కూడా డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ వచ్చినా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఆక్సిడెంట్ లు అవుతుంటాయి. అందుకే ఈరోజుల్లో సెల్ప్ డ్రైవింగ్ మోడ్ కలిగిన హై ఎండ్ కార్లు చాలా ఎక్కువ వస్తున్నాయి.ఇక వాటిల్లో మరింత సమర్థంగా ఇంకా అలాగే అత్యంత ఆధునిక ఫీచర్లతో ప్యూగోట్ కంపెనీ ఇన్సెప్షన్ కాన్సెప్ట్ కారును కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈసీ)లో ప్రదర్శించడం జరిగింది.ఇక స్వీయ డ్రైవింగ్ శ్రేణిలో విశేష అనుభూతిని అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఫీచర్లు ఇంకా అలాగే స్పెసిఫికేషన్లను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈ ప్యూగోట్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ కారును లాంచ్ చేసింది. ఆటో డ్రైవ్ ఆప్షన్ తో వస్తున్న ఈ కారులో ఐ కాక్ పిట్ అనే ఫీచర్ ఉంటుంది.


ఈ ఫీచర్ సెల్లాంటిస్ ఎస్టీఎల్ఏ స్మార్ట్ కాక్ పిట్ టెక్నాలజీని వినియోగించుకుంది. దీనిలో లెవెల్ 4 ఆటోనామస్ డ్రైవింగ్  టెక్నాలజీ అనేది వస్తుంది. లెవెల్ 4 అంటే కొన్న ప్రదేశాల్లో ఈ కారు ఆటోమేటిక్ గా తనకు తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది.ఇంకా అలాగే ఈ కారులోని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైపర్ స్క్వేర్ కంట్రోల్ సిస్టం. ఈ సిస్టంని వీడియోగేమ్స్ వాడే స్టీర్ బై వైర్ టెక్నాలజీని వినియోగించుకొని దీనిని బాగా అభివృద్ధి చేశారు. ఈ కారు 2026 నుంచి తన ప్రొడక్షన్ ని ప్రారంభించే అవకాశం ఉంది.ఇక ప్యూగోట్ అప్డేటెడ్ కారులో 100kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది ఏకంగా 497 మైళ్ల రేంజ్ ను అందిస్తుంది. ఇంకా అలాగే దీనిలో రెండు మోటార్లు ఉంటాయి. ఈ రెండూ కలిపి మొత్తం 680 హార్స్ పవర్ ను అందిస్తాయి.ఇక ఈ కారు మూడు సెకన్లలో గంటకు 0 నుంచి 62 మైళ్ల స్పీడ్ ని అందుకుంటుంది. దీనికి వైర్ లెస్ ఇండక్షన్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: