త్వరలో చవకగా ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలు?

ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది.కేవలం సిటీలు, పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.ఇంకా అలాగే వైఫై సేవలు గ్రామాల్లోకి కూడా వచ్చేశాయి.కరోనా వైరస్ వల్ల వచ్చిన లాక్ డౌన్ కారణంగా కంపెనీలన్ని కూడా ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి. దీంతో తమ సొంతూళ్లకు వెళ్లి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సంస్ధలు కూడా గ్రామాల్లో వైఫై సేవలు అనేవి అందిస్తున్నాయి. చాలా కంపెనీలు కూడా గ్రామాలకు కూడా వైఫై సేవలు విస్తరించాయి. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అవి అందిస్తున్నాయి.ఇక ఇండియాలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించేందుకు చాలా కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా అమెజాన్ కంపెనీ హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించేందుకు బాగా కసరత్తు చస్తోంది. అత్యంత తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ ని అందించేందుకు సిద్దమవుతోంది. ప్రాజెక్ట్ కైపవర్ అనే పేరుతో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం బెంగళూరులో ఒక మేనేజర్ ను కూడా నియమించుకునేందుకు సిద్ధమైంది.


ఇక బిజినెస్ స్ట్రాటజీ లీడ్ ఇంకా కంట్రీ డెవపల్ మెంట్ ఉద్యోగులను నియమించుకోనుంది.ఈ ప్రాజెక్ట్ కైపర్ అనేది ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహల సమూహన్ని ప్రారంభించేందుకు ఒక ఇనిషియేటివ్ అని, తక్కువ లేటెన్సీ ఇంకా హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుందని కైపర్ కంట్రీ డెవపల్ మెంట్ టీమ్ చెబుతోంది. ఇంకా అలాగే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ పేరుతో తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్ కంపెనీ ఇండియాలో దరఖాస్తులను పెట్టుకుంది.ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సేవలు అందించాలని భావించింది. అయితే లైసెన్స్ తీసుకోకుండా ఈ సేవలను ప్రారంభించడంపై కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి అనుమతులు తీసుకోవాలని తెలిపింది. దీంతో ఇక వచ్చే జనవరి నాటికి లైసెన్స్ తీసుకోవాలని స్సేస్ ఎక్స్ ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: