టెస్లా : త్వరలో రోబో ట్యాక్సీ.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన!

ప్రపంచంలో అందరి కంటే అపర కుబేరుడుగా పేరు తెచ్చుకొని దూసుకుపోతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజుకి అదిరిపోయే టెక్నాలజీని పరిచయం చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా రోబో ట్యాక్సీని తీసుకు వస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తు కోసం ఒక రోబోట్యాక్సీని తన కంపెనీ నిర్మించనున్నట్లు తెలిపారు.ఇక ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్ ఇంటర్నెట్ ఇంకా అలాగే రియూబబుల్ రాకెట్ బూస్టర్లతో చాలా విజయాలను నమోదు చేస్తున్నాడు మస్క్. అలాగే ఇప్పుడు సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్‌లో రోబోట్యాక్సీ గురించి ఆయన చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ క్యాబ్‌ను ప్రారంభించేందుకు తాము సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు.


ఇక అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ రోబోట్యాక్సీ సేవలను కూడా మున్ముందు స్టార్ట్ చేస్తామని ఆయన తెలిపారు. రోబోట్యాక్సీతో ప్రయాణాలు చాలా సులభంగా ఇంకా అలాగే చాలా సులువుగా అవుతాయన్నారు. అయితే ఈ ట్యాక్సీని ఎప్పుడు తీసుకు వస్తారో అనేది ఇంకా ఆయన వెల్లడించలేదు. రోబో ట్యాక్సీలను 2019 వ సంవత్సరంలో ప్రకటించగా ఇప్పుడు అవి ఆచరణలోకి వస్తాయని ఆయన అన్నారు.ఇక ఇదిలా ఉండగా, ఆస్టిన్ సమీపంలోని కొత్త ఫ్యాక్టరీలో సైబర్ ట్రక్ పికప్‌ను కూడా టెస్లా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొత్త రోడ్‌స్టర్ ఇంకా అలాగే ఎలక్ట్రిక్ సెమీని తయారు చేయడాన్ని స్టార్ట్ చేస్తుందని కూడా ఆయన తెలిపారు. ఇక అలాగే వచ్చే ఏడాది నుండి భారీస్థాయిలో కొత్త ఉత్పత్తులు కూడా వస్తాయని ఆయన అన్నారు.ఇలా రోజు రోజుకి కొత్త కొత్త టెక్నాలజీలను జనాలకు పరిచయం చేస్తూ ఎలాన్ మస్క్ చాలా వేగంగా దూసుకుపోతున్నారు.ఇక అనతి కాలంలోనే ఎలాన్ మస్క్ బిల్ గేట్స్, జెఫ్ బేజోస్ లాంటి అపర కుబేరులను వెనక్కి నెట్టి తన వినూత్నమైన ఆలోచనలతో టెస్లాని ముందుకు నడిపిస్తూ టాప్ లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: