చెలరేగిన బౌలర్స్ “సన్ రైజర్స్” అద్భుత విజయం..

Bhavannarayana Nch

వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ టీం వరుసగా ఆడిన 6 మ్యాచ్ లలో  5 మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసింది..రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సన్‌రైజర్స్  అత్యద్భుతమైన ప్రదర్శనతో అద్భుత విజయం సాధించింది. కష్ట సాధ్యం కాని లక్ష్యమే అయినా సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటడంతో పంజాబ్ 119 పరుగులకే ఆలైట్ అయింది.

 

మొదట బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ టీం 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది...అయితే వీరిలో మనీష్ పాండే 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేయగా షకీబ్(28), యుసుఫ్(21) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాజ్‌పుత్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడికంటే ముందు ఇషాంత్ శర్మ 12 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.

 

అయితే తమ ముందు ఉన్న చిన్న లక్ష్యాన్ని పంజాబ్ ఆటగాళ్ళు రాహుల్ , గేల్ ఉన్నంత సేపు మెరుపులు మెరిపించారు అయితే వీరిద్దరూ వేగంగా ఆడడానికి కొంచెం ఇబ్బంది పడినా క్రమంగా వేగాన్ని పెంచేశారు...దాంతో ఈ క్రమంలోనే వీరిద్దరూ పెవిలియన్‌కు చేరారు. 55 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 69 పరుగుల వ్యవధిలో మిగతా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్‌మన్లలో రాహుల్ 32, గేల్ 23 పరుగులతో రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. ఏది ఏమైనా సన్ స్ట్రోక్ పంజాబ్ కి గట్టిగా తగిలిందన చెప్పవచ్చు..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: