“షాకింగ్ డెసిషన్” తీసుకున్న “క్రికెట్ బోర్డు”

Bhavannarayana Nch

సంచలనాలకి మారు పేరైనా కెన్యా క్రికెట్ బోర్డు ఇప్పుడు మరొక సంచలనానికి దారి తీసింది..ఉన్నట్టుండి ఒక్కసారిగా కెన్యా క్రికెట్ బోర్డులో అలజడి రేగింది...ఈ అలజడితో కెన్యా క్రికెట్ బోఅర్డు సంక్షోభంలో పడింది..అసలు వివరాలలోకి వెళ్తే..వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో కెన్యా క్రికెట్‌ జట్టు ఘోర ప్రదర్శన కనపరిచింది...అయితే ఈ ఓటమికి భాద్యత వహిస్తూ..దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ కెఫ్టెన్‌ రాకెప్‌ పటేల్‌ కెఫ్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

 

అయితే ఇప్పుడు కెప్టెన్ బాటలోనే తాత్కాలిక కోచ్ ధామస్ ఓడియో కూడా పదవి నుంచి తప్పుకున్నారు. అంతే కాకుండా కెన్యా క్రికెట్‌ బోర్డులోప్రెసిడెంట్ జాకీ జాన్ మహ్మద్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.. నమీబియాలో జరిగిన టోర్నీలో కెన్యా ఒక్క విజయం కూడా సంపాదించలేక పోయింది..ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా తొలుత కెప్టెన్ రాకెప్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు...ఇదిలాఉంటే ప్రపంచ క్రికెట్‌లో ఒక క్రికెట్‌ బోర్డుకు తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న కెన్యా బోర్డు ప్రెసిడెంట్‌ జాకీ జాన్ మహ్మద్ సైతం నైతిక బాధ్యతగా వీడ్కోలు నిర్ణయం తీసుకున్నారు.

 

ఇలా ఒకరి తరువాత మరొకరు కీలక భాద్యతలలో ఉన్న వాళ్ళు అందరు తప్పుకోవడంతో బోర్డు సంక్షోభం లో పడింది..ఇప్పటికే సరైన గుర్తింపు లేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కుంటున్న బోర్డు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ అభిమానులు అందోళన చెందుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: