“కోహ్లీ భజన ఆపండి”

Bhavannarayana Nch

కేంద్ర క్యాబినెట్ ప్రధాని నరేంద్రమోడిని కి ఎలా అయితే భజన చేస్తుందో అంతకంటే ఎక్కువగా “బీసీసీఐ” కోహ్లీ భజన చేస్తోంది అంటూ రామచంద్ర గుహ విమర్శించారు..అసలు ఈ రామచంద్ర గుహ ఎవరంటే క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ  సభ్యుడు...దేనికైనా సరే హద్దు ఉంటుందని..మితిమీరిన భజన మంచిది కాదని హితవు పలికారు ఈ మేరకు టెలిగ్రాఫ్‌ వార్తాసంస్థకు రాసిన కాలమ్‌లో కోహ్లిపై రామచంద్ర గుహా ధ్వజమెత్తారు.

 

భారతక్రికెటర్లు ,సెలెక్టర్లు ,మిగలిన అందరు కోహ్లీ ముందు మరగుజ్జుల్లా కనిపిస్తున్నారని విమర్శించారు మొన్నటివరకూ “బీసీసీఐ” లో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలింది అని ఇప్పుడు అదనంగా కోహ్లీ భజన చేస్తోందని మండిపడ్డారు..అయితే ఈ తాలూకు భజనకి ఆయన ఓ పేరు పెట్టారు..ఈ భజన పేరు “సూపర్‌ స్టార్‌ సిండ్రోమ్‌”  అంటూ ఎద్దేవా చేశాడు...బీసీసీఐలో తనకు సంబంధం లేని విషయాల్ని కూడా కోహ్లి ప్రభావం కనబడుతుందంటే ఇది భజన కాక ఏమిటని ప్రశ్నించాడు.

 

ఇదిలా ఉంటే కుంబ్లే ఒక్కడే అతడి ముందు స్వతంత్రంగా వ్యవహరించగల్గిన వ్యక్తి అని.. అసలు అనిల్‌ కుంబ్లే తన కోచ్‌ పదవి నుంచి వైదొలగడానికి కారణం ఎవరో అందరికీ తెలుసంటూ ఈ సందర్బంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో బోర్డు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కోహ్లీ  చెప్తేనే కానీ చేయలేని పరిస్థితిలోకి బోర్డు వచ్చింది అంటూ మండిపడ్డారు గుహ

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: