ఇండియన్ క్రికెట్ హిస్టరీలో.. రోహిత్ అత్యంత చెత్త రికార్డు?

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పుణ్యమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఎటువంటి విమర్శలు వెల్లువెత్తాయి అందరికీ తెలిసిందే. అదే సమయంలో రోహిత్ అత్యంత దారుణమైన రికార్డు కూడా నమోదు చేయడం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ కనీసం 2 అంకెల స్కోర్ కూడా చేయడానికి నానా ఇబ్బంది పడ్డాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఫలితంగా అతడు సిడ్ని టెస్ట్ కు దూరం కావలసి వచ్చింది. వ్యక్తిగత కారణాలవల్ల అతడు మ్యాచ్ కు దూరమయాడని చెబుతున్నప్పటికీ.. ఫామ్ కోల్పోవడంతోనే అతడిని దూరం అయ్యాడనే విషయం అందరికీ తెలిసిందే.

సిడ్నీ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణమైన ఆట తీరు ప్రదర్శించడం వలన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆట దారుణంగా ఉందని, ఇకపై ఆడింది చాలని.. వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని చాలామంది కామెంట్స్ చేసారు. టెస్ట్ క్రికెట్ కు కూడా టి20 మాదిరిగానే రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించారు. ఈ క్రమంలో హ్యాపీ రిటర్మెంట్ అనే యాష్ ట్యాగ్ ను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మనం చూసాం. దీంతో రోహిత్ సిడ్నీ టెస్ట్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ టీమిండియా ఓడిపోక తప్పలేదు. 6 వికెట్ల తేడాతో సిడ్నీ టెస్ట్ లో ఓటమి మాత్రమే కాకుండా... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోవడం బాధాకరం.

అసలు విషయంలోకి వెళితే... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలం కావడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత దారుణమైన రికార్డును నెలకొల్పినట్టు సమాచారం. అవును, టీమిండియా చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన సారధిగా నిలిచాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ 3 టెస్టులు ఆడాడు. పెర్త్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ భార్య ప్రసవించింది. దీంతో తన భార్య వద్ద ఉండాల్సి రావడంతో రోహిత్ తొలి టెస్ట్ కి దూరం అయ్యాడు. ఆ టెస్టులో భారత్ గెలిచింది.. ఆ తర్వాత అడిలైడ్ లో జరిగిన టెస్ట్ కు రోహిత్ అందుబాటులోకి వచ్చినప్పటికీ టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొన్నారు. మూడు టెస్టులు ఆడిన రోహిత్ 6.20 యావరేజ్తో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే దశలో అత్యంత చెత్త రికార్డు నెలకొల్పిన కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: