భార్య ఫోటోలు డిలీట్ చేసిన క్రికెటర్... ఇక విడాకులేనా?

praveen
అవును, ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ తన భార్య ఫోటోలను సోషల్ మీడియానుండి తొలగించాడు. దాంతో సర్వత్రా అనేక అనుమానాలు తలెత్తాయి. ఇదే విషయమై ఇపుడు సోషల్ మీడియా వేడెక్కిపోతోంది. అతను మరెవ్వరో కాదు... క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. ఈయన గురించి జనాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన చాకచక్యమైన స్పిన్‌తో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో చాహల్ ఎటువంటి ధీరుడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో అతడి పేరు మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు మెగా వేలం గతేడాది చివర్లో జరగగా సదరు వేలంలో చాహల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. పంజాబ్ కింగ్స్ ఏకంగా అతగాడిని రూ.18 కోట్ల ధరకు దక్కించుకుంది. అయితే, చాహల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారిందో.. ఇపుడు అతడి పర్సనల్ లైఫ్ దానికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అవును, విషయంలోకి వెళితే... చాహల్ 2020లో ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటి, మోడల్, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌ర్‌ అయినటువంటి ధనశ్రీ - చాహల్ మధ్య కొన్నేళ్లు ప్రేమాయణం సాగగా వివాహం చేసుకొని ఈ జంట రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా జీవించింది.
అయితే కొన్ని ఊహించని పరిణామాలతో వారి జీవితానికి శుభం కార్డు పడనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అవును... ఈ లవ్ కపుల్ ఇపుడు విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ధనశ్రీ పై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. చాహల్ స్పందించే వాడు. తాజాగా వీరి విడాకులకు సంబంధించిన మరిన్ని వార్తలు నెట్టింట వైరల్ కావడంతో ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో అన్‌ఫాలో అనంతరం చాహల్ తన అకౌంట్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను తొలగించడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. దీంతో ఈ జంట విడాకులు నిజమేనని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేశారు. అయితే వీరి విడాకులకు సంబంధించి వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో 2023లో ధనశ్రీ తన భర్త చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పుడు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: