అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగింది.. రోహిత్ ని పక్కన పెట్టడంపై పంత్ ఏమన్నాడంటే?
కాగా తాజాగా ఈ విషయంపై స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్లారిటీ ఇస్తూ... హిట్‌మ్యాన్ కావాలనే అలా చేశాడని, రెస్టు తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ... "ఈ నిర్ణయం అనేది రోహిత్ ఎంతో భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం. మేం ఎప్పటికీ అతనిని ఒక సారథిగానే చూస్తాం. ఎందుకంటే అతడు గొప్ప నాయకత్వాన్ని వహించాడు. అయితే కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. వాటి విషయంలో ఎవ్వరు కూడా ఏమీ చేయలేం. నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను!" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే పంత్ మాటల్ని బట్టి పరిశీలిస్తే... రోహిత్ మ్యాచ్‌కు దూరం కావడం వెనుక మేనేజ్మెంట్, సెలెక్టర్ల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నట్టు కనబడుతోందనే అనుమానాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యక్త పరుస్తున్నారు. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా హిట్‌మ్యాన్ వెనక్కి తగ్గడని, అలాంటోడ్ని పక్కా స్కెచ్ ప్రకారమే టీమ్ నుంచి సైడ్ చేశారని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా రోహిత్ శర్మను సిడ్నీ టెస్టులో ఆడించకపోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనేది నగ్న సత్యం. ఈ క్రమంలోనే కొందరు అతడికి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హిట్‌మ్యాన్ కెరీర్ ముగిసిందని, మెల్బోర్న్ టెస్టే అతడికి చివరిదని లెజెండ్ సునీల్ గవాస్కర్ అనడం వివాదం అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్-2027కు అందుబాటులో ఉండే ప్లేయర్ కోసం సెలెక్షన్ కమిటీ అన్వేషిస్తోందని.. అందుకే రోహిత్‌ను సైడ్ చేశారని చెప్పుకొచ్చాడు. అంటే డైరెక్టుగానే ఇక అతడి టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు.