రోహిత్ తలనొప్పి తెచ్చుకోవాలనుకోడు.. అందుకే.. అశ్విన్ కామెంట్స్ వైరల్?

frame రోహిత్ తలనొప్పి తెచ్చుకోవాలనుకోడు.. అందుకే.. అశ్విన్ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా అటు 2025 ఐపీఎల్ సీజన్ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లబోతున్నాడు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్ టీం గా నిలిపి సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ శర్మ వేలంలోకి రాబోతున్నాడు అంటూ చర్చ జరుగుతోంది.

గత ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను అటు కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించింది. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో హిట్ మాన్ అభిమానులందరూ కూడా అటు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో కూడా చేశారు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ట్రోలింగ్ కూడా చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అసంతృప్తితో ఉన్నాడట రోహిత్ శర్మ. దీంతో వేలంలో పాల్గొంటాడు అంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతను వేలంలోకి వస్తే ఏ జట్టు అతన్ని కొనుగోలు చేస్తుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

 మొన్నటికి మొన్న లక్నో ఏకంగా 50 కోట్లు పెట్టి రోహిత్ ను జట్టులోకి తీసుకోబోతుంది అంటూ చర్చ జరిగింది. అయితే ఇలా రోహిత్ ముంబైని వీడతారని.  మరో జట్టులోకి వెళ్ళబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ విషయంపై అశ్విన్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి డబ్బు ముఖ్యం కాదు అంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసినంతవరకు రోహిత్ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడు అంటూ తెలిపాడు. భారత జట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబైకి చాలా సార్లు కెప్టెన్ గా చేశాను. ఇప్పుడు కెప్టెన్ గా లేకపోయినా పరవాలేదు కానీ ముంబై తోనే ఉండాలని రోహిత్ కోరుకుంటాడు అంటూ ఇటీవలే ఓ చర్చలో అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: