వరదల్లో చిక్కుకున్న టీమిండియా స్పిన్నర్.. చివరికి?
ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న విపత్కర పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో భారీ వరదల కారణంగా ఎంతోమంది ప్రముఖులు వరదల్లో చిక్కుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇటీవలే టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న ప్లేయర్ కూడా ఇలాగే వరదల్లో చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సరైన సమయంలో స్పందించడంతో సదరు టీమిండియా ప్లేయర్ ను కాపాడ గలిగారు.
గుజరాత్ లో ప్రస్తుతం కుండ పోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇక నది కట్టలు సైతం తెంచుకొని భారీగా వరద నీరు జనావాసాల్లోకి చేరుతుంది. ఈ క్రమం లోనే ఇటీవలే టీమ్ ఇండియా మహిళా స్పిన్నర్ రాధా యాదవ్ వరదల్లో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆమెను కాపాడాయి. ఈ సంగతిని ఆమె స్వయం గా సోషల్ మీడియా లో పంచుకున్నారు. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వమైత్రి నది కట్టలు తెంచుకుంది. దీంతో వడోదరలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు రాధా యాదవ్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.