వార్నీ.. పెళ్ళాం మీద కసితోనే.. ఒలంపిక్స్ పథకం గెలిచాడట?
అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఉండే ఒక డైలాగ్ అతనికి బాగా సరిపోయింది. ఎవరైనా బలంగా కొడతాడు లేదంటే కోపంతో కొడతాడు వీడు ఏంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటూ కడుతున్నట్టు.. చాలా పద్ధతిగా కొట్టాడు. వాడు మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఇప్పుడు డీకేక్ యూసుఫ్ కి బాగా సరిపోతుంది. ఎందుకంటే అతను ఏదో టీ తాగడానికి వచ్చాడేమో అన్న విధంగా ఇలా వచ్చి అలా మెడల్ సాధించకపోయాడు. ఇక షూటింగ్ చేసే క్రీడాకారులు ధరించే స్పెషల్ గేర్, కళ్లద్దాలు ధరించకుండా జీన్స్ టీషర్ట్ కళ్లకు రెగ్యులర్ కళ్ళజోడు ధరించి క్యాజువల్ గా వచ్చి అలా ఒక జేబులో చేతి పెట్టుకొని జస్ట్ అలా షూట్ చేసి సిల్వర్ మెడల్ కొట్టేసాడు.
దీంతో అతను మెడల్స్ సాధించిన తీరు గురించి తెలిసి నిజంగానే ఆడు మగాడ్రా బుజ్జి అంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది ఇంటర్నెట్ జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే అతను ఇదంతా సాధించింది భార్య మీద కోపంతోనేనట. కొన్నాళ్ల క్రితమే డీకేక్ భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడట. కనీసం తన పిల్లలను చూడడానికి కూడా అతని భార్య అనుమతించట్లేదట. ఇక విడాకుల కారణంగా ఏర్పడిన మానసిక వేదనను అధిగమించేందుకు.. షూటింగ్ను కెరియర్ గా మార్చుకున్నాడట. ఇక జీవితంలో జరిగిన నెగిటివ్ సంఘటన ద్వారా ఏర్పడిన కసి పట్టుదల తోనే ఇక ఒక లక్ష్యం వైపు వెళ్ళాడట. ఈ క్రమంలోనే షూటింగ్ ప్రాక్టీస్ చేసి ఇక ఇప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేతగా నిరూపించాడు.