నేడే మూడో టి20.. క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా?
కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా.. ఇక నేడు మూడో మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఇక రెండు మ్యాచ్లలో గెలిచిన పట్టుదలతోనే ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా గెలవాలని అనుకుంటుంది. ఇలా గెలిచి శ్రీలంక జట్టుకి సొంత దేశంలోనే షాక్ ఇచ్చి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది భారత జట్టు. కాగా ఈరోజు భారత్ శ్రీలంక మధ్య పల్లెకెళ్లే వేదికగా మూడో టి20 మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టు.. ఇక చివరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. కాగా ఇక ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో టి20 మ్యాచ్ లో జట్టులో పలు మార్పులు చేసుకుని బరిలోకి దిగే చాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. సాయంత్రం ఏడున్నర గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.