నా ఆట బాలేదు.. నాకు తెలుసు.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఈ మధ్యకాలంలో టీమ్ ఇండియాలో యంగ్ ప్లేయర్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వాలి టోర్నీలతో పాటు ఐపీఎల్ లాంటి టోర్నీలలో అద్భుతంగా రాణిస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభ ఏంటి అన్న విషయాన్ని చూపించగలుగుతున్నారు. ఈ క్రమంలోనే సెలెక్టర్ల చూపుని  ఆకర్షించి అతి తక్కువ సమయంలోనే ఇక మంచి గుర్తింపును సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టులో కూడా తక్కువ సమయంలోనే చోటును సంపాదించుకోగలుగుతున్నారు.

ఇక టీమిండియా కు ఫ్యూచర్ స్టార్స్ తామే అనే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇలా భారత ఫ్యూచర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా ఒక ఆటగాడి పేరు ఇక ఇండియన్ క్రికెట్లో వినిపిస్తూనే ఉంటుంది. అతని పేరు శుభమన్ గిల్. ఏకంగా ఎన్నో రోజుల నుంచి టీమ్ ఇండియాకు ఓపెనర్ గా కొనసాగుతున్న అతను.. ఇక ఇటీవల ప్రమోషన్ కూడా పొందాడు అని చెప్పాలి. t20 లతోపాటు వన్డే టెస్ట్ ఫార్మట్ లో కూడా వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. దీంతో అతనే ఫ్యూచర్ కెప్టెన్ అని  బిసిసిఐ సెలెక్టర్లు ఒక చిన్న హింట్ ఇచ్చేశారు అని చెప్పాలి.

 ఇక మొన్నటికి మొన్న జింబాబ్వే పర్యటనలో గిల్ ఏకంగా టీమ్ ఇండియాకు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. కానీ అతను ఆశించినదగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఇక తన ప్రదర్శన పై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత ప్రదర్శన ఊహించినంత చేయ లేదని అభిప్రాయపడ్డాడు.  అంచనాలకు అందుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 2026 t20 వరల్డ్ కప్ కి ముందు 30- 40 t20 మ్యాచ్ లు ఆడతానని.. అప్పట్లోపు మరింత మెరుగ అయ్యేందుకు కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఓపెనింగ్ జోడీలో జైష్వల్ తో కలిసి బ్యాటింగ్ చేయడానికి ప్రస్తుతం ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ తో ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాం అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: