సూసైడ్ చేసుకోవాలనుకున్న షమీ.. సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్..??

praveen

టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కొన్ని నెలల క్రితం చాలా పెద్ద కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్లేయర్ అనుకోని ఆరోపణ వల్ల చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన స్నేహితుడు ఉమేష్ కుమార్ చెప్పిన ప్రకారం, షమీ ఒకానొక సమయంలో  ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. 2018లో షమీ భార్య హసీన్ జహాన్ ఆయనపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరింది. షమీ తనను హింసించాడని, ఇంకో స్త్రీతో అఫైర్ పెట్టుకున్నాడని హసీన్ ఆరోపించింది. కానీ షమీ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించాడు. తన ఇమేజ్‌ని దెబ్బతీయాలనే తన భార్య ఇలాంటి నీచమైన కామెంట్ చేస్తూ ఉందని వాపోయాడు.
ఇదే సమయంలో 2021లో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ బాగా ఆడలేకపోయాడు. దీంతో కొంతమంది ఆయన మ్యాచ్‌ ఫిక్సింగ్ చేశాడని ఆరోపించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఆయన్ని మతం పరంగా కించపరిచారు. షమీ స్నేహితుడు, ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు ఉమేష్ కుమార్ తన 'అన్‌ప్లగ్డ్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, "ఆ సమయంలో షమీ చాలా కష్టపడ్డాడు. నేను ఉండే ఇంట్లోనే ఉండేవాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చినప్పుడు షమీ చాలా దిగ్భ్రాంతి చెందాడు. షమీ భారత దేశానికి వెన్నుపోటు పొడిచాడని అందరూ అంటుంటే ఆయన తట్టుకోలేకపోయాడు..."
"ఆయన ఆ రాత్రి సూసైడ్ లాంటిది ఏదో చేసుకోవాలనుకున్నాడు. నేను నీళ్లు తాగడానికి లేచి వంటగదికి వెళ్తున్నప్పుడు బాల్కనీలో షమీ నిలబడి ఉన్నాడు. మేం 19వ అంతస్తులో ఉండేవాళ్లం. అక్కడినుంచి అతడు దూకుతాడని నాకు అర్థమైపోయింది. షమీ జీవితంలో ఆ రాత్రి చాలా కష్టమైనది. ఆ తర్వాత ఒక రోజు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన ఫోన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో క్లీన్ చిట్ వచ్చిందని మెసేజ్ చూపించాడు. అప్పుడు ఆయనకు వరల్డ్ కప్ గెలిచినంత ఆనందం కలిగింది." అని ఉమేష్ చెప్పాడు. ఉమేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: