బుమ్రా కాదు.. ఆ ఇద్దరే అత్యుత్తమ క్రికెటర్లు : జయ సూర్య

praveen
మొన్నటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన టీమిండియా చివరికి టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత t20 ఫార్మాట్లో వరల్డ్ కప్ టైటిల్ ముద్దాడగలిగింది భారత జట్టు. అయితే ఇలా వరల్డ్ కప్ లో అదరగొట్టి ప్రశంసలు అందుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా.

 ఈ క్రమంలోనే వన్డే టెస్ట్ ఫార్ మాటల్లో అటు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా బరిలోకి దిగుతూ ఉండగా టి20 ఫార్మాట్కు అటు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ ని కొత్త టీ20 కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ. దీంతో మొదటిసారి రెగ్యులర్ కెప్టెన్ గా  సూర్య కుమార్ యాదవ్ అటు భారత జట్టును ముందుకు నడిపించబోతున్నారు అని చెప్పాలి. అయితే భారత్ జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ లలో తప్పక విజయం సాధించాలని లక్ష్యంతో ప్రస్తుతం శ్రీలంక కూడా అన్ని వ్యూహాలను  సిద్ధం చేసుకుంటుంది.

 ఇక ఈనెల 27వ తేదీ నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు  చేపట్టగా అతని నేతృత్వంలో మొదటి సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇంకోవైపు భారత జరగబోయే సిరీస్ ల కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు సనత్ జయసూర్యను తాత్కాలిక కోచ్గా నియమించుకుంది. కాగా ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలిక కోచ్ గా వ్యవహరిస్తున్న జయ సూర్య టీమిండియా క్రికెటర్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ప్రశంసలు జల్లు కురిపించాడు. అదే సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గైర్హాజరుని తమకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ విరాట్లు ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్స్. సుదీర్ఘకాలంగా టీమిండియా విజయాలలో ఇద్దరు కీలక పాత్ర పోషిస్తున్నారు  జడేజా సైతం అసాధారణమైన ఆల్ రౌండర్. ఈ ముగ్గురికి గైర్హాజరు టీమిండియా కు నష్టమే. వారి గైర్హాజరును అని మేము అడ్వాంటేజ్ గా తీసుకుంటాం అంటూ జయచెప్పుకొచ్చాడు. అయితే బుమ్రాకు ఈ పర్యటన నుంచి విశ్రాంతిని ఇవ్వగా ఇక అతను టీమిండియాలో ఉన్న తమకు ఎలాంటి నష్టం లేదు అన్నట్లుగా బుమ్రాను అసలు గుర్తు చేయలేదు జయ సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: