ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య కుమార్ యాదవ్‌కు నో ప్లేస్..??

praveen
తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ODI ఫార్మాట్‌లో అతడికి భవిష్యత్తు ఉండకపోవచ్చు అన్నట్లు కామెంట్లు చేశాడు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాలో అతడికి స్థానం ఉండకపోవచ్చని అన్నాడు. చోప్రా ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో భాగం కాడు. 2025లో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇందులో కూడా ఆడడు.
శ్రీలంకలో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కంటే ముందు సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 కెప్టెన్‌గా నియమించారు.  అయితే అతనికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.  ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత్ శ్రీలంక పర్యటనతో సహా ఆరు వన్డేలు మాత్రమే ఆడనుంది. విలేకరుల సమావేశంలో సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్‌ను వన్డే జట్టులోకి తీసుకోలేదని వివరించారు. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగా ఉందని చెప్పాడు. యాదవ్ T20I జట్టులో భాగమని అగార్కర్ స్పష్టం చేశాడు.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ODI ప్రణాళికలలో భాగం కాదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సూచించిన్నట్లు వెల్లడించాడు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యే అవకాశం లేదని చోప్రా పేర్కొన్నాడు. "2023 ODI వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 2024 t20 వరల్డ్ కప్‌లో కూడా భాగమయ్యాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టాడు, కానీ అతను ఇప్పుడు వన్డే జట్టులో భాగం కాదు." అని చోప్రా అన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన, ప్రత్యేకమైన ఆటగాడు, కానీ అతను కేవలం T20I లలో మాత్రమే కనిపిస్తాడు. ప్రస్తుతం ODIలకు అతన్ని తీసుకోవాలని ఎవరూ ప్లాన్ చేయట్లేదట. 2023 ప్రపంచకప్ ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఆడలేదు.  అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఈ బ్యాటర్ 28 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అతను భారతదేశం తరపున 37 ODI మ్యాచ్‌లు ఆడాడు, నాలుగు అర్ధ సెంచరీలతో సహా 25.76 సగటుతో 773 పరుగులు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉండే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. వివిధ ఫార్మాట్లలో గిల్ బాగా ఆడుతున్నాడని అందుకే వైస్-కెప్టెన్‌గా అతడిని ఎంచుకుంటున్నారని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్ భాగమవుతాడు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.  గిల్ మూడు ఫార్మాట్ల ఆటగాడు అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: