ఐపీఎల్ 2025.. ఆ జట్టుకు కెప్టెన్ గా రోహిత్?

praveen
ప్రస్తుతం టీమిండియాకు వన్డే టెస్ట్ ఫార్మట్ లలో కెప్టెన్ గా కొనసాగుతున్నారు రోహిత్ శర్మ. మొన్నటికి వరకు T20ఫార్మాట్ కి కూడా సారధిగా కొనసాగాడు. అయితే ఇటీవలే వరల్డ్ కప్ టైటిల్ ని టీమిండియా కు అందించిన అనంతరం తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా టీమ్ ఇండియాకు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు.. 2024 ఐపిఎల్ సీజన్ కి ముందు ఎంత చేదు అనుభవం ఎదురయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఐదుసార్లు అతను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కి టైటిల్ అందిస్తే.. ఆ జట్టు యాజమాన్యం మాత్రం అతన్ని అర్ధాంతరంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది.

 అతన్ని కాదని కెప్టెన్సీలో ఎలాంటి అనుభవం లేని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. దీంతో ఒక సాదాసీదా ఆటగాడిగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రోహిత్ ఇక ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. దీంతో రోహిత్ అభిమానులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారూ. అయితే 2025 ఐపీఎల్ లో మెగా వేలం జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ ని మరో జట్టు తీసుకునే అవకాశం ఉందని ఏకంగా కెప్టెన్సీ కూడా అప్పజెప్తుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఒక జట్టు రోహిత్ కు కెప్టెన్సీఅప్పగించేందుకు నిర్ణయించుకుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఆ టీం ఏదో కాదు లక్నో. ప్రస్తుతం లక్నో కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఆ జట్టు నుంచి బయటకు రావాలని అనుకుంటున్నాడట. మెగా వేలంలో పాల్గొని ఏకంగా ఆర్సిబి టీంలోకి వెళ్లాలని ఇప్పటికే చర్చలు కూడా పూర్తి చేసుకున్నాడట. ఆ జట్టులోకి వెళ్తే ఆర్సిబి కెప్టెన్ గా ఛాన్స్ కూడా దక్కించుకోబోతున్నాడట. దీంతో లక్నో కి కొత్త కెప్టెన్ అవసరం ఉండగా.. అప్పటికే కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మను తమ జట్టులోకి తీసుకొని సారధ్య బాధ్యతలు అతని చేతిలో పెట్టాలని అనుకుంటుందట లక్నో ఫ్రాంచైజీ. దీంతో 2025 ఐపీఎల్ సీజన్ లో లక్నో కెప్టెన్గా రోహిత్ బరిలోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: