ఏపీ అసెంబ్లీ : జగన్ వస్తే.. అసలు పరీక్ష చంద్రబాబుకే?

praveen
మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయ్. ఈ క్రమంలోనే అందరిలోనూ ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని  చవిచూసిన వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైసిపి. దీంతో ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో ఇక అటు అసెంబ్లీలో టిడిపికి కౌంటర్లు ఇచ్చే నాయకులు ఎవరూ లేకుండా పోయారు. గెలిచిన వారందరూ కూడా జూనియర్లే.

 దీంతో జగన్ ఒక్కడే టిడిపికి కౌంటర్ ఇచ్చేందుకు ఒంటరి పోరాటం చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇక టిడిపి జనసేన బిజెపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్న దాని ప్రకారం.. జగన్ అసెంబ్లీకి వస్తే ఆ పరీక్ష జగన్కు కాదు చంద్రబాబుకే అనే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తక్కువ సంఖ్య బలం ఉన్న జగన్ అటు అసెంబ్లీకి వస్తే ఎలాగో టిడిపి జనసేన బిజెపి తరపున గెలిచిన సభ్యులు కౌంటర్లు వేయడం, హేళన చేయడం లాంటివి చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే.

 అయితే ఇలా చేయకుండా చంద్రబాబు ఎంత మేరకు ఆపగలుగుతారు అన్నదే అసలు పరీక్ష. ఎందుకంటే గతంలో వైసిపి గెలిచిన సమయంలో అసెంబ్లీ సమావేశాలలో ఏకంగా తక్కువ సంఖ్య బలం ఉన్న ప్రతిపక్ష టిడిపి పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది ప్రవర్తన తీరు చూస్తే మాత్రం ఇది అసెంబ్లీనా చాపల మార్కెట్టా అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే వైసిపి తరఫున గెలిచిన సభ్యులు ఎంత రెచ్చిపోయిన జగన్ వాళ్ళని ఆపలేదు. ఇలాంటి పరిస్థితి నచ్చకే చివరికి 2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించారు ఏపీ ప్రజలు. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా మీరు ఏమైనా చేసుకోండి అని ఇక కూటమి ఎమ్మెల్యేలను ఆపకుండా వదిలేస్తే.. అప్పుడు జగన్ చేసింది ఇక ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడని ఇందులో తేడా ఏముంది అనే భావన ఏపీ ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది.


అందుకే తక్కువ సంఖ్య బలం ఉన్న జగన్ పై కూటమి ఎమ్మెల్యేలు పర్సనల్గా విమర్శలు చేయకుండా.. పరిధి దాటి ప్రవర్తించకుండా.. కేవలం రాజకీయంగా మాత్రమే కౌంటర్లు ఇచ్చి హుందాగా ప్రవర్తించే విధంగా చంద్రబాబు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు  రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ గతంలో జగన్ చేసిన తప్పే ఇక ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో రిపీట్ చేస్తే మాత్రం రానున్న ఎన్నికల్లో అది చంద్రబాబుకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: