ధోని, కోహ్లీతో.. నన్ను నేను పోల్చుకోను : నీరజ్

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి ఇక మ్యాచ్ నీ కన్నార్పకుండా చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

 అయితే క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్యా మిగతా క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు రాదు. ఒకవేళ వారి వారి ఆటల్లో వారు బాగా రాణించినప్పటికీ ఇక వారిని క్రికెటర్లతో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు ఎంతోమంది క్రీడాభిమానులు. అయితే గత కొంతకాలం నుంచి జావలిన్ త్రో విభాగంలో అద్భుతంగా రాణిస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న అటు నీరజ్ చోప్రా ను కూడా ఇప్పుడు వరకు ఎంతో మంది క్రికెటర్లతో పోల్చి చూసారు అన్న విషయం తెలిసిందే. అయితే జావేలిన్ త్రోలో వరుసగా మెడల్స్ సాధిస్తున్న నీరజ్  చోప్రాని క్రికెట్ లో ధోని విరాట్ కోహ్లీతో సమానం అంటూ ఇటీవలే కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేశారు.

 అయితే ఇదే విషయం గురించి ఇటీవల స్పందించిన నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జావలిన్ క్రీడకు మరింత గుర్తింపును తీసుకురావడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు నీరజ్. స్టార్ క్రికెటర్లు ధోని, విరాట్ కోహ్లీతో తనను తాను ఎప్పుడూ పోల్చుకోలేదు అంటూ స్పష్టం చేశాడు. ఒలంపిక్స్ తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని.. కానీ క్రికెటర్లతో పోల్చి చూస్తే అది తక్కువే అంటూ నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి గల్లీలో కూడా క్రికెట్ ఆడతారు అంటూ ఇక  గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: