హార్థిక్ పాండ్యాకు.. బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ?

praveen
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పే సమయంలో ఇక కోహ్లీ తర్వాత కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ పేరు వినిపించింది. అనుకున్నట్టుగానే రోహిత్ శర్మ చేతికి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ ఎవరికీ దక్కబోతుంది అనే విషయంపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ సహా మరి కొంతమంది పేర్లు కూడా కెప్టెన్సీ రేస్ లో వినిపించాయ్. అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా అందరిని వెనక్కినట్టే గుజరాత్ కెప్టెన్గా ఐపీఎల్లో టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రేసులో ముందుకు వచ్చేసాడు.

 అటు బీసీసీఐ ఎలక్టర్లు కూడా హార్దిక్ పాండ్యాకు వరుసగా వైస్ కెప్టెన్సీ అప్పగిస్తూ వచ్చారు. రోహిత్ రెస్ట్ తీసుకున్నప్పుడల్లా ఇక తాత్కాలిక కెప్టెన్గా హారతిక్ పాండ్యా అనే వ్యవహరించాడు. దీంతో రోహిత్ తర్వాత ఇక టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించబోయేది హార్దిక్ పాండ్యానే అన్న విషయాన్ని అందరూ నమ్మారు. ఇక ఇటీవల  రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే అటు హార్దిక్ పాండ్యా చేతికి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో బీసీసీఐ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న హార్దిక్ కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకుండా ఒకసాదాసీదా ఆటగాడు గానే పరిమిత చేసింది.

 టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ వరకు రోహిత్ కు డిప్యూటీగా కొనసాగిన హార్దిక్ పాండ్యా ఇటీవల శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో ఒక సాదాసీదా ఆటగాడు గానే ఉన్నాడు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ కు t20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అదే సమయంలో కనీసం హార్దిక్కు వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. వైస్ కెప్టెన్ గా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కు అవకాశం కల్పించింది. వన్డేలు t20 లకు కూడా గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించడం గమనార్హం. దీంతో హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: