ఉమ్రాన్ మాలిక్ ఎందుకు వెనకబడ్డాడు.. మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఈమధ్య కలలో టీమ్ ఇండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇక క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటూ అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇలా తమ ప్రదర్శనతో ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కొంతమంది యువ ఆటగాళ్లు ఇక టీమిండియాలో ఛాన్స్ దక్కించుకుంటూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.

 కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం ఎందుకో మొదట్లో మెరుపులు మెరూపించి టీమిండియా ఫ్యూచర్ అని అనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేక ఇక కనుమరుగై పోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆటగాడు కూడా ఒకరు. అతను ఎవరో కాదు ఉమ్రాన్ మాలిక్. ఏకంగా అతను ఐపీఎల్లో ఆడటం ద్వారా ఎంతలా గుర్తింపును సంపాదించుకున్నాడో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమ్ ఇండియాలో ఏ బౌలర్ కి సాధ్యం కాని రీతిలో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ గా మారిపోయాడు.

 అలాంటి ప్లేయర్ ఎక్కువ కాలం పాటు టీమ్ ఇండియాలో మాత్రం ఉండలేకపోయాడు. ఎందుకంటే వేగంతో బౌలింగ్ వేసినప్పటికీ ఎక్కువ పరుగులు సమర్పించుకోవడంతో సెలెక్టర్లు అతని పక్కన పెట్టారు. ఇలా కేవలం ఐపీఎల్లో మాత్రమే కాదు టీమ్ ఇండియాలో కూడా తలుక్కున మెరిసి ఒక్కసారిగా కనుమరుగైపోయాడు జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. అయితే అతను ఇలా మిగతా ప్లేయర్లతో పోల్చి చూస్తే వెనుకబడటానికి కారణం ఏంటి అన్న విషయాన్ని మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించాడు. 146 - 148 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బోలింగ్ చేయడం చాలా కష్టం. ఎంత వేగంతో బౌలింగ్ చేసిన లైన్ అండ్ లెంత్ ఎంత ముఖ్యం. అలా బౌలింగ్ చేస్తే భారీగా పరుగులు ఇచ్చుకోవాల్సిందే. ఉమ్రాన్ మాలిక్ కు ఇదే సమస్య అతను భవిష్యత్తులో మెరుగు అవుతాడని భావిస్తున్న అంటూ మాజీ బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: