కెప్టెన్సీకి.. సూర్య కంటే హార్దిక్ బెటర్ ఆప్షన్.. కానీ?

praveen
ఇటీవల వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లి ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే విశ్వ విజేతగా అవతరించింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడంతో ఇక భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు .

 రోహిత్తో పాటు కోహ్లీ కూడా ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు టి20 ఫార్మాట్లో కొత్త కెప్టెన్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇక టి20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ గా రాబోయే ఆటగాడు ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యానే భారత జట్టు కెప్టెన్ గా మారతాడని అందరూ అనుకున్నప్పటికీ సూర్య కుమార్ యాదవ్, బుమ్రా సహా మరి కొంత మంది పేర్లు కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ చేతికే టీమిండియా టి20 కెప్టెన్సీ పగ్గాలు అందే అవకాశం ఉంది అని గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది.

 అయితే ఇలా టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీకి సూర్యకుమార్ యాదవ్ కంటే హార్దిక్ పాండ్యా బెటర్ ఆప్షన్ అని పలువురు క్రికెట్ మాజీలు మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉండడమే కారణం అనేది తెలుస్తుంది. హార్దిక్ నాయకత్వంలో ఇండియా 16 t20 లో ఆడితే ఏకంగా 10 మ్యాచ్లలో విజయం సాధించింది. ఐపీఎల్ లో జిటి, ఎంఐ జట్లకు కూడా హార్దిక్ కెప్టెన్సీ వహించిన అనుభవం ఉంది. అయితే సూర్య కెప్టెన్ గా ఏడు  టి20 మ్యాచ్ లలో ప్రాతినిధ్యం  వహిస్తే ఐదింటిలో టీమిండియా గెలిచింది. కాగా హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ సమస్యలు మైనస్ గా మారబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: