జూనియర్ బుమ్రా.. ఈ పాక్ బుడ్డోడి బౌలింగ్ కి అందరూ ఫిదా?

praveen
టీమిండియాలో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న జస్ట్ ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆట తీరుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక భారత జట్టు విజయాలలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ అదరగొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉంటాడు అని చెప్పాలి.

 అయితే వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా జస్ట్ ప్రీతి బుమ్రా కి ఈ రేంజిలో గుర్తింపు రావడానికి కేవలం అతని మంచి గణాంకాలు నమోదు చేయడమే కాదు.. అతని బౌలింగ్ చేసే శైలి కూడా కారణం అని చెప్పాలి. మిగతా బౌలర్లతో పోల్చి చూస్తే విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో బుమ్రా ఎప్పుడు బంతులు వేస్తూ ఉంటాడు. అందుకే ఇక అతని బౌలింగ్ యాక్షన్ కి కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు స్టార్ ఫేసర్ బుమ్రా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారా.. ఇక ఇప్పుడు ఏకంగా బుమ్రాను మైమరిపించే విధంగా ఒక బుడ్డోడు బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా  షాక్ అవుతున్నారు. ఏకంగా బుమ్రా లాగానే ఇక్కడ ఒక బుడ్డోడు అదే బౌలింగ్ యాక్షన్ తో యార్కర్లను సంధిస్తూ ఉన్నాడు. అయితే ఈ బుడ్డోడు పాకిస్తాన్ కు చెందిన వాడు కావడం గమనార్హం. బుమ్రా ఎలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో బంతులు వేస్తాడో.. ఇక్కడ ఒక బుడ్డోడు కూడా జిరాక్స్ కాపీ లాగానే ఒక్క మూమెంట్ కూడా మిస్ కాకుండా బౌలింగ్ వేస్తున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోగా అతనికి మంచి శిక్షణ ఇస్తే రానున్న రోజుల్లో పెద్ద ఆటగాడు అవుతాడు అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: