ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పార్టిసిపేట్ చేయకపోతే.. ఆ టీమ్ కు ఛాన్స్..??

praveen
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ODI సిరీస్ షెడ్యూల్ అయింది. ఈ టోర్నమెంట్ ప్రపంచకప్ తో సమానంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇందులో ప్రపంచంలోని 8 అగ్రశ్రేణి క్రికెట్ జట్లు పోటీపడతాయి. కానీ ఈసారి, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుండటం వల్ల, భారత జట్టు పాల్గొనడం కష్టం అవుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత, భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ కు పర్యటించడం మానేసింది.
2023 ఆసియా కప్ సిరీస్ కూడా పాకిస్థాన్ లోనే జరగాల్సి ఉంది. కానీ టీమిండియా పాకిస్థాన్ కు వెళ్లకుండా, శ్రీలంకకు మార్చాలని bcci పట్టుబడుతోంది. అప్పటికే, భారత జట్టు ఆడే మ్యాచ్ లు మాత్రమే శ్రీలంకలో జరిగాయి. బీసీసీ వర్గాల సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో పాల్గొనడానికి భారత జట్టును పాకిస్థాన్‌కు వెళ్లనివ్వడం లేదు. ఈ కారణంగా, భారత మ్యాచ్ లు దుబాయ్ లేదా శ్రీలంకలో జరగాలని బీసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలిని (ICC) కోరింది.
కానీ, ఈ అభ్యర్థనను ICC తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే, భారత జట్టు కోసం మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి మిగిలిన ఏడు జట్లు అంగీకరించవు. ముఖ్యంగా, ఈ టోర్నమెంట్ కు హోస్ట్ గా ఉన్న పాకిస్థాన్ ఇందుకు అంగీకరిస్తుందా అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. అదే సమయంలో, భారత జట్టు ఈ సిరీస్ లో పాల్గొనకపోతే, ప్రసార హక్కులు, ప్రకటనల ద్వారా భారీ ఆదాయం నష్టం అవుతుంది.
పాకిస్థాన్ లో జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుండి భారత జట్టు తప్పుకునే అవకాశం ఉంది. అలా జరిగితే, భారత్ స్థానంలో ఏ జట్టు వస్తుంది? 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సహా టాప్ 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. కాబట్టి, ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న శ్రీలంక, 10వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించలేదు. భారత్ తప్పుకుంటే, ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉన్న శ్రీలంక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది.
ప్రస్తుతం, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రీడాకారులు టెన్నిస్ లాంటి ఇతర క్రీడల కోసం పాకిస్థాన్ వెళ్లారు. కాబట్టి, భారత ప్రభుత్వం కొన్ని షరతులతో చాలా కాలానికి తర్వాత భారత జట్టును పాకిస్థాన్ కు వెళ్లనివ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: