బ్యాంక్ జాబ్ వదిలేసి.. యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించింది?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలి ఎంతగానో మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతున్న కాలానికి అనుకూలంగానే మనిషి తన అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సంపాదన సృష్టించుకోవడంలో  కూడా ప్రతి మనిషి సరికొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు మంచి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక పెద్ద ఉద్యోగంలో చేరితే చాలు.. ఇక జీవితం సెట్ అయిపోయినట్లే అని భావిస్తూఉండేవారు జనాలు.

 కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న వారి కంటే ఏమి చదువుకోకుండా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నవారు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతేకాదు ఇక పెద్ద పెద్ద చదువులు చదివిన వారి సైతం నేటి రోజుల్లో వినూత్నమైన రీతిలో ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటివారిలో ఇక యూట్యూబ్ ని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబ్ ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారు కోట్లలోనే ఉన్నారు.

 ఇక్కడ ఒక అమ్మాయి ఇలాంటిదే చేసింది. సాధారణంగా బ్యాంకు ఉద్యోగం వస్తే అదృష్టం అని అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ తొమ్మిదేళ్లుగా బ్యాంకు ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఆ ఉద్యోగంలో ఆ సంతృప్తి లేక చివరికి జాబ్ మానేసింది. తర్వాత యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించింది. లండన్ కు చెందిన నిశ్చ షా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. 11 నెలల్లో 1000 మంది సబ్స్క్రైబర్లనే పొందింది. 2022లో తన జీవితంపై ఒక వీడియో అప్లోడ్ చేయగా.. ఏకంగా అది సూపర్ హిట్ అయింది. 50,000 మంది సబ్స్క్రైబర్లను తెచ్చి పెట్టింది. మూడు లక్షల ఆదాయం కూడా వచ్చింది. దీంతో జాబ్ మానేసి ఇక ఇప్పుడు యూట్యూబ్ మీదే సంపాదిస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ సలహాలు సూచనలు ఇస్తూ ఉంది. దీంతో గత మే నుంచి ఈ మే వరకు ఎనిమిది కోట్లు యూట్యూబ్ ద్వారా సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: