అల్లు అర్జున్ కి.. బాగా కలిసొచ్చిన ఈ రెండు సెంటిమెంట్ల గురించి తెలుసా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు దర్శకులు ప్రొడ్యూసర్లు ఇక తమకు అచ్చొచ్చిన విషయాలను సెంటిమెంట్లుగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి సినిమా విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా స్టార్స్ కు సంబంధించిన సెంటిమెంట్ల గురించి  వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయట  ఏకంగా రెండు సెంటిమెంట్లను అల్లు అర్జున్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాడట.

 పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇక దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ సార్ గా మార్చేసింది . ఇక ఇప్పుడు ఈ మూవీకి పార్ట్ 2 తెరకెక్కుతూ ఉండగా.. ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల మళ్ళీ సినిమాను వాయిదా వేశారు.

 అయితే ఇక అల్లు అర్జున్ కు తన సినిమాల విడుదల విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయట. తను నటించిన చిత్రాలు ఏప్రిల్ లో కనుక విడుదలయితే.. ఆయనకు సూపర్ హిట్ ఖాయమని సెంటిమెంట్ ఇండస్ట్రీలోనే కాదు అల్లు అర్జున్ కు కూడా ఉందట. ఇప్పటివరకు ఏప్రిల్ లో వచ్చిన బన్నీ రేసుగుర్రం సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కి కలిసి వచ్చిన మరొక సెంటిమెంట్.. వైజాగ్. తన సినిమా షూటింగ్ను వైజాగ్ లో చేస్తే కచ్చితంగా కలిసి వస్తుందని బన్నీ నమ్ముతాడట. గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు చిత్రాలు వైజాగ్లో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలు ఎంత మంచి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: