హెడ్ కోచ్ గా గంభీర్.. కోహ్లీ ఎక్కువ ఆడకపోవచ్చు అంటున్న మాజీ ప్లేయర్?

praveen
టీమిండియాకు హెడ్ కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన నేపద్యంలో ఇక బీసీసీఐ పెద్దలకు భారత జట్టు కోసం కొత్త హెడ్ కోచ్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది  ఈ క్రమంలోనే ఇటీవల భారత మాజీ ఆటగాడు అయినా గౌతమ్ గంభీర్ ను కొత్త ప్రధానకోచ్గా నియమించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులు ఆయన పూర్తిస్థాయి బాధ్యతలుచేపటి జట్టును కోచ్గా ముందుకు నడిపించబోతున్నాడు అని చెప్పాలి. అయితే గౌతమ్ గంభీర్ ఇలా హెడ్ కోచ్గా ఎంపిక అయ్యాడో లేదో ఒక విషయంపై చర్చ తెర మీదకి వచ్చింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి వివాదాలు  చోటు చేసుకుంటాయో అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

 ఎందుకంటే గతంలో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ మధ్య ఎంత పెద్ద గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా గతంలో ఐపీఎల్ లో ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అన్న విధంగా దారుణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక ఆ తర్వాత తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక వైరం కొనసాగుతూనే ఉంటుంది అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉద్దేశం. ఇలాంటి సమయంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉండగా జట్టులో కీలక ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీంతో ఏం జరగబోతుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 అయితే ఆటగాళ్ల విషయంలో గంభీర్ ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు అని అందరూ అంచనా వేస్తున్నారు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్ల విషయంలో గంభీర్ మరింత కఠినంగా ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే సౌత్ ఆఫ్రికా మాజీ ఫేసర్ డైల్ స్టేయిన్ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఇక ఎక్కువ కాలం క్రికెట్ ఆడకపోవచ్చు. అయితే వాళ్ళని గంభీర్ పక్కన పెడతాడు అని చెప్పలేను. కానీ అతను మాత్రం సీనియర్ ప్లేయర్ల విషయంలో కఠినంగా ఉంటాడు అని అనిపిస్తుంది అంటూ డైల్ స్టేయిన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: