మైదానంలో జెండా పాతడంపై.. రోహిత్ పై విమర్శలు?

praveen
13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవల టీమిండియా జట్టు వరల్డ్ కప్ టైటిల్ ని ముద్దాడింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీ లో గెలిచిన వరల్డ్ కప్ ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేకపోయింది. అయితే ధోని తర్వాత ఎంతోమంది కెప్టెన్లు  మారినప్పటికీ ఇక వరల్డ్ కప్ కళ మాత్రం టీమ్ ఇండియాకు నెరవేరలేదు అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వాళ్ళు కప్ టోర్నిలో టైటిల్ గెలిచినంత పని చేసింది టీమిండియా కానీ అదృష్టం కలిసి రాక ఫైనల్లో ఓడిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇటీవల వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో మాత్రం టీమిండియా అద్భుతంగా రానించింది అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా.. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు చేరుకోవడమే కాదు ఫైనల్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ విజేతగా అవతరించింది. దీంతో ఇక టీమ్ ఇండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక 140 కోట్ల మంది భారతీయులు కూడా టీమిండియా ప్రదర్శన పట్ల, ఇలా సుదీర్ఘ నిరీక్షణకు తేడాదించుతూ వరల్డ్ కప్ గెలవడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా సెలబ్రేషన్స్ కూడా అంబరాన్ని అంటాయి అని చెప్పాలి.

 అయితే ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ ఏకంగా భారత జాతీయ జెండాని మైదానంలో పాతిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు రోహిత్ చేసిన పనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలా మైదానంలో జెండాను పాతిన ఫోటోని రోహిత్ తన సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటోగా కూడా మార్చారు. ఇక ఇప్పుడు దీనిపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ జెండాను రోహిత్ ఆగౌరపరిచారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. జాతీయ పతాక నియమావళి ప్రకారం జెండా నేలపై తాకేలా ఉంచడం నేరం అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ అలా చేయకుండా ఉండాల్సింది అంటూ కొంతమంది ఇంటర్నెట్ జనాలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: