క్రికెట్ ఒక్కటే ఆటా.. మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి?

praveen
13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ  ఇటీవల టీమిండియా ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ ని ముద్దాడింది అన్న విషయం తెలిసిందే  అప్పుడెప్పుడో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ లో 2011లో వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఒక్కసారి కూడా ప్రపంచకప్ ట్రోఫీని అందుకోలేకపోయింది. అయితే ఎన్నోసార్లు ప్రపంచకప్ టోర్నమెంట్లలో అద్భుతంగా రానించి ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన.. ఫైనల్ పోరులో మాత్రం తడబడి.. చివరికి కప్పు గెలవాలనే కలను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది అని చెప్పాలి.

 అయితే ఇటీవల 2024 t20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తూ జైత్రయాత్రను కొనసాగించింది.ఒక్క ఓటమి లేకుండానే వరల్డ్ కప్ టైటిల్ విజేతగా అవతరించింది టీమిండియా. దీంతో భారత జట్టుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రాగా బీసీసీఐ ట్రోఫీ గెలిచిన జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరితో కూడా ముంబైలోని వీధుల్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించింది.

 అయితే ఈ రోడ్ షో కి లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. దీంతో ముంబై వీధులన్నీ మొత్తం కిక్కిరిసిపోయాయ్ అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టుకి అటు బీసీసీఐ 120 కోట్లు బహుమతి ఇవ్వడం గమనార్హం. ఇక ఈవెంట్ తర్వాత మనదేశంలో క్రికెట్కు ఎంత విపరీతమైన క్రేజీ ఉంది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మిగతా క్రీడలకు అన్యాయం జరుగుతుంది అంటూ అభిప్రాయం కూడా బయటకు వస్తుంది. వరల్డ్ కప్ గెలిచిన టీంకి బీసీసీఐ ఇచ్చిన 120 కోట్లు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైజ్ మనీ అందిస్తున్నాయి. దీంతో క్రికెట్ ఒకటే ఆటా.. మిగతావి కాదా అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కబడ్డి, కోకో, టెన్నిస్, బ్యాట్మెంటన్ లాంటి ఎన్నో ఆటలను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అని కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: