కూటమి కుమ్ములాటల్లో కొత్త ట్విస్ట్... ఇలా అయితే బాబుకు ముసళ్ల పండగే...!
పైగా గతంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది.. ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు. దాంతో ఆ 31 నియోజకవర్గాలలో వారికి బలమైన కేడర్ ఉంది. అంతేకాదు వారికి అక్కడ పలుకుబడి ఉంది. అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో తెలుసు. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు కూడా బాగా తెలుసు. ఇలా తమకు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో తమకు నియోజకవర్గాలలో పెద్దపీట వేయాల్సిందే అన్నది తమ్ముళ్ల వాదన. కానీ.. ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన, బిజేపి వాళ్ళ వాదన ఒకలా ఉంది. ఇప్పుడు అధికారం చుట్టూ అంతా తిరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో తాము కూడా బలపడాలని చూస్తున్నారు.
దీంతో అగ్గిరాజుకుంటుంది. మేము ఎక్కువ ఉంటే మాదే ఆధిపత్యం అని అటువైపు వారు అంటున్నారు. ఎక్కడో ఎందుకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ పిఠాపురంలోనూ నేతల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నేత వర్మ కూటమీ ప్రభుత్వం గద్దెనెక్కిన తొలి నెల నుంచి అసంతృప్తితో ఉన్నారు. వర్మ వర్సెస్.. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నట్టుగా పిఠాపురం రాజకీయం సాగుతోంది. రాయలసీమలో ఆదోని నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య గొడవ ముదిరిపాకనా పడింది. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాలలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా దీనికి చంద్రబాబు, పవన్ బ్రేకులు వేయకపోతే కూటమి కుమ్ములాటలు ప్రభుత్వ పరువును బజారున పడేసేలా కనిపిస్తున్నాయి.