దేవర' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో అందరికి బాగా నచ్చిన పాట ఆయుధ పూజ. దీనికి కారణం ఇందులో ఎన్టీఆర్ అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అలరించడమే.అలాగే ఆ సాంగ్ కోసం గణేష్ మాస్టర్ చాలా అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. సాంగ్ గురించి చెప్పినపుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతోకాలంగా నాతో సాంగ్ చేయాలని అతను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అన్ని రకాల డాన్స్ స్టెప్పులు గతంలో చేసేసాను. అయితే ఇందులో చేసినవి చాలా ప్రత్యేకం. డాన్స్ అంతా తాండవం ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయుధ పూజ సాంగ్ లో తాతగారి స్టెప్ కావాలని పెట్టింది కాదు. గణేష్ మాస్టర్ తన స్టైల్ లో ఏదో కంపోజ్ చేశారు. నేను తరువాత చూసుకుంటే తాతగారి స్టెప్ ఉందనే విషయం నాకు అర్ధమైందని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.ఇదిలావుండగా ఈ ఆయుధ పూజ సాంగ్ నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ పాటకు కాలు కదిపారు. తారక్ గ్రేస్ ను మ్యాచ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ నాగార్జున మాస్ డాన్స్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ కూలీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే వైజాగ్‌లో కూలీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. నాగార్జున యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట లీక్ అయ్యాయి.
అయితే నాగార్జున ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు.ఇదిలావుండగా తెలుగు రాష్ట్రాల్లో దసరా వరకు దేవరకు తిరుగులేదు. కాబట్టి.. దేవర మేకర్స్‌కు భారీ లాభాలు రావడం గ్యారెంటీ. ఇక ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ చూసిన కొరటాల.. దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆచార్య తర్వాత కేవలం ఎన్టీఆర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు కొరటాల. దేవరతో తానేంటో చూపించాడు. అందుకే.. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్‌లు చూసిన తనకు.. దేవర సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 నిర్మించారు. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.