రేపు సెంచరీ నమోదు కాకపోతే.. అది కూడా రికార్డే?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్.. ఇక ప్రేక్షకులందరికీ కూడా ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అద్భుతంగా సాగుతూ ప్రేక్షకులందరినీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. అయితే యుఎస్ లో ఉన్న స్లో పిచ్ లపై అగ్రశ్రేణి టీమ్స్ తడబడితే.. చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేసాయి. దీంతో ఈ వరల్డ్ కప్ లో అందరు అంచనాలు కూడా తారుమారు అయ్యాయి. ఏకంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి అగ్రశ్రేణి టీమ్స్ లీగ్ దశతోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తే.. అమెరికా లాంటి జట్లు మాత్రం సూపర్ 8 దశకు చేరుకున్నాయి.

 అయితే ఈ వరల్డ్ కప్ సీజన్లో ఎంతో మంది ఆటగాళ్లు తమ బ్యాటింగ్ తో అదరగొట్టేసారు. సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే భారీ స్కోరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇక ఎంతోమంది బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తూ బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ ఉంటారు. కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో పెద్దగా బ్యాట్స్మెన్ల ఆటలు సాగలేదు. స్లో పిచ్లపై అటు పరుగులు చేసేందుకు ఎంతగానో కష్టపడి పోయారు అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ వరల్డ్ కప్ పోరు ఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఎంతోమంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు తప్ప.. ఆ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో మాత్రం ఇబ్బంది పడ్డారు.

 అయితే ఈ ఏడాది 2024 వరల్డ్ కప్ ఎడిషన్ లో కేవలం ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రేపు సౌత్ ఆఫ్రికా, టీమిండియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మ్యాచ్లో 90లోకి వచ్చిన శతకం మాత్రం చేర్చారుచుకున్నాడు. ఒకవేళ ఫైనల్ లో ఏ ఆటగాడు సెంచరీ కొట్టకపోతే.. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక శతకం లేని రెండో పర్యాయం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే 2009లో టి20 వరల్డ్ కప్ లో కూడా ఏ ఒక్క ఆటగాడు సెంచరీ చేయలేకపోయారు. ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కూడా ఒక్కరు కూడా సెంచరీ చేయకపోతే  మరోసారి ఇదే రికార్డు రిపీట్ అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: