ప్రపంచ రికార్డు సృష్టించిన.. భారత ఓపెనర్లు?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్ల నుంచి వరల్డ్ కప్ టైటిల్ కి పూర్తిగా దూరమైపోయిన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి పై పైచేయి సాధిస్తూ ఉంది టీమిండియా.

 ఇలా ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా ఏకంగా వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో ఫైనల్ వరకు దూసుకు వచ్చింది భారత జట్టు. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుంది. టీమిండియా దూకుడు చూస్తూ ఉంటే ఫైనల్లో కూడా గెలిచేలాగే కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా ఇలా టీమిండియా పురుషుల జట్టు వరల్డ్ కప్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంటే మరోవైపు అటు భారత మహిళల జట్టు కూడా అదరగొట్టేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అరుదైన రికార్డు సృష్టించింది భారత మహిళల టెస్ట్ జట్టు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డును సొంతం చేసుకుంది అని చెప్పాలి.

 అంతర్జాతీయ మహిళల టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పింది. భారత ఓపెనర్ల జోడి అయిన స్మృతి మందాన, శేపాలి వర్మ జోడి.. ఈ ఇద్దరు కలిసి ఏకంగా 292 పరుగులు బాదేశారు. సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనతను అందుకున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనింగ్ జోడి పేరిట ఉండేది. సర్జిదా షా, కిరణ్ బాలుచ్ ఇద్దరు కలిసి 241 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఇక వీరిదే అత్యధిక భాగస్వామ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల ఓపెనింగ్ జోడి ఈ రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: