ఎంతైనా సూర్య తోపే.. అరుదైన రికార్డ్?

praveen
పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే మైండ్ సెట్ తో బ్యాక్ పట్టుకుని మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లు.. ఇక తమ బ్యాటింగ్ తో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. కొన్ని కొన్ని సార్లు అయితే బౌలింగ్ వేసి వికెట్లు తీయాల్సిసిన బౌలర్లు కేవలం బ్యాట్స్మెన్ల విధ్వంసం ముందు ప్రేక్షకుల పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటి మెరుపులు కనిపించడం లేదు.

 ఎందుకంటే యుఎస్ లో ఉన్న స్లో పిచ్లపై మహా మహా ప్లేయర్లు సైతం ఇక తమదైన శైలిలో రాణించలేకపోతున్నారు. కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే బాగా రాణించగలుగుతున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎలా ప్రదర్శన చేస్తాడు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మొదట్లో కాస్త విఫలమైనట్టు కనిపించిన సూర్య కుమార్ యాదవ్ సూపర్ 8 మ్యాచుల్లో మాత్రం బలంగా పుంజుకున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 47 పరుగులు తేడాతో విజయం సాధించింది.

 అయితే భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు అని చెప్పాలి. హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అనుకున్నాడు. దీంతో ఒక అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరింది. అతి తక్కువ టి20 మ్యాచ్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ప్లేయర్గా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్. 64 మ్యాచ్లలోనే 15 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. 120 మ్యాచ్లలో 15 సార్లు ఈ అవార్డును అందుకొని సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు కోహ్లీ. ఆ తర్వాత స్థానంలో మలేషియా ప్లేయర్ విరన్దీప్ ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: